దుర్గామాత విగ్రహ ప్రతిష్ట లో పాల్గొన్న ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి

దుర్గామాత విగ్రహ ప్రతిష్ట లో పాల్గొన్న ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, సిద్దిపేట : సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలం ఎల్కల్ గ్రామంలో శ్రీ కనకదుర్గ అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ, బోనాల పండగ లో మహోత్సవానికి మెదక్ పార్లమెంటు సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి  గురువారం నాడు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.  ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమం లో పాల్గొన్న ఆయన భక్తులకు అన్న ప్రసాదం వడ్డించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు  గ్రామదేవతల కృపతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని కోరారు. స్వరాష్ట్రంలోనే మన గుళ్లకు, దేవుళ్ళకు, ఆదరణ లభిస్తుందని కొత్త ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. సమైక్యాంధ్ర పాలనలో తెలంగాణలో దేవాలయాల అభివృద్ధి పై శీత కన్ను వేయడం జరిగిందన్నారు.

సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో  దేవాలయాల అభివృద్ధి చేపట్టడం జరిగిందన్నారు. మన కొమురెల్లి మల్లన్న పేర సీఎం కేసీఆర్ మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్మించడం జరిగిందన్నారు.  అభివృద్ధిదేశంలో ఎక్కడా లేని విధంగా నూతన పంచాయతీ రాజ్ చట్టం తీసుకువొచ్చిన సీఎం కేసీఆర్ వాటికి ప్రత్యేక నిధులు కేటాయించి వాటి బలోపేతం కోసం కృషి చేయడం జరిగిందన్నారు. ఏ గ్రామంలో చూసినా గ్రామ దేవతల పండుగలతో కళలాడుతుందన్నారు. సీఎం కేసీఆర్ చేపడుతున్న రైతు సంక్షేమ కార్యక్రమాలతో రైతుల  ముఖంలో సంతోషం వెల్లివిరుస్తుందన్నారు.  తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మన చెరువు కుంటల వద్ద ఉత్సవాలు చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు.