ఆటో డ్రైవర్లను ఆదుకోండి

ఆటో డ్రైవర్లను ఆదుకోండి

ముద్ర, స్టేషన్ ఘన్ పూర్: మహాలక్ష్మి పథకంతో ఉపాధిని కోల్పోతున్న ఆటో డ్రైవర్లను ఆదుకోవాలని ఆటో డ్రైవర్లు, యజమానులు డిమాండ్ చేశారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గ కేంద్రం గాంధీ చౌరస్తా నుండి బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ విగ్రహం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్ల యూనియన్ గౌరవ అధ్యక్షుడు రాజారావు జైపాల్, మండల అధ్యక్షుడు గుర్రం మధు మాట్లాడుతూ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం తో ఆటోలకు డిమాండ్ తగ్గిందని ఫలితంగా జీవనోపాధి కోల్పోతున్నామన్నారు. ప్రభుత్వం ఆటో డ్రైవర్ల జీవనోపాధికి నెలకు రూ. 25 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బాస్ కుల సమ్మయ్య ఉపాధ్యక్షుడు చింత జోజి, ప్రధాన కార్యదర్శి లక్ష్మీనారాయణ, దయాకర్, అన్వర్, శాగ శీను, గంగరాజు, చింత ప్రవీణ్, నీల మొగిలి, చేపూరి ఎల్లేష్, పారునంది బిక్షపతి, చెరుపల్లి విజయ్, సాదం భీమయ్య, తాళ్లపల్లి రమేష్, గాండ్ల ప్రవీణ్ వివిధ గ్రామాలకు చెందిన ఆటో డ్రైవర్లు, ఓనర్లు పాల్గొన్నారు.