సొమ్మొకడిది... సోకొకడిది

సొమ్మొకడిది... సోకొకడిది
  • కడియం పై ఎమ్మెల్యే రాజయ్య పరోక్ష వ్యాఖ్య 

ముద్ర, స్టేషన్ ఘన్ పూర్: సొమ్మొకడిది... సోకొక్కడిదని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య ఎమ్మెల్సీ కడియం శ్రీహరి పై పరోక్ష వ్యాఖ్యలు చేశారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గ కేంద్రంలో రూ. 2 కోట్ల 65 లక్షల వ్యయంతో నిర్మించిన ఇండోర్ స్టేడియం ను ఆదివారం స్థానిక ఎమ్మెల్యే రాజయ్య ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ కేంద్రంలో మోడల్ స్కూల్, కస్తూరిబా పాఠశాల, మైనారిటీ పాఠశాల, ఎస్టీ బాలికల ఆశ్రమ పాఠశాలల తోడుగా ఇండోర్ స్టేడియం రావడం ఈ ప్రాంతమంతా ఎడ్యుకేషన్ హబ్ గా మారిందన్నారు. అంతేకాకుండా 2009 నుండి పాలిటెక్నిక్, ఆశ్రమ పాఠశాలలో, ఫైర్ స్టేషన్, ఫ్లైఓవర్ బ్రిడ్జ్, అండర్ బ్రిడ్జ్, మహిళ డిగ్రీ కళాశాల, వంద పడకల ఆసుపత్రి తాను తీసుకువచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తుంటే కొందరు తామే అభివృద్ధి చేశామని చెప్పుకోవడం "సొమ్మొకడిది సోకొకడిది" అన్న చందంగా మారిందని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి శ్రీహరిని పరోక్షంగా విమర్శించారు. మహిలి మహిళా డిగ్రీ కళాశాలకు సొంత భవనం లేక ప్రస్తుతం పెంబర్తిలో నడుస్తుందని, ఫైర్ స్టేషన్ను స్థానిక మార్కెట్ యార్డ్ లో త్వరలో ప్రారంభిస్తామన్నారు. గడిచిన పదేళ్లలో నియోజకవర్గంలో  అభివృద్ధి పరుగులు పెడుతుందని ఒక మున్సిపాలిటీ తప్ప అన్ని వచ్చే అన్నారు. గతంలో మున్సిపాలిటీ రాకుండా ఎవరు అడ్డుపడ్డారు కూడా తెలుసని రాజేష్ అన్నారు. విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించేందుకు ఏర్పాటుచేసిన ఈ మినీ స్టేడియంలో సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో జడ్పిటిసి మారపాక  రవి, ఎంపీపీలు రడపాక సుదర్శన్, కందుల రేఖ గట్టయ్య, మార్కెట్ చైర్మన్ గుజ్జరి రాజు, వైస్ చైర్మన్ చందర్ రెడ్డి, స్థానిక సర్పంచ్ సురేష్ కుమార్, మండల పార్టీ అధ్యక్షుడు మాచర్ల గణేష్, ఎంపీటీసీలు బెల్లపు వెంకటస్వామి, గన్ను నరసింహులు, సింగపురం దయాకర్ లోని వివిధ పాఠశాలకు చెందిన పీఈటీలు, విద్యార్థులు పాల్గొన్నారు.