పోలింగ్ బూత్ ల వద్ద సెలబ్రెటీలు.. ఫొటోలు ఇవిగో!

పోలింగ్ బూత్ ల వద్ద సెలబ్రెటీలు.. ఫొటోలు ఇవిగో!
  • ఓటు హక్కు వినియోగించుకున్న సినీ ప్రముఖులు
  • అయ్యప్ప మాలలో మెగస్టార్ చిరంజీవి
  • పోలింగ్ కేంద్రంలో సామాన్యుడిలా లైన్ లో నిలబడ్డ వైనం

తెలంగాణలో ఉదయం నుంచి పోలింగ్ కొనసాగుతోంది. రాష్ట్రంలోని వివిధ పోలింగ్ కేంద్రాల వద్ద సినీ, రాజకీయ ప్రముఖులు ఓటేశారు. అయ్యప్ప మాల వేసుకున్న మెగాస్టార్ చిరంజీవి.. సామాన్యుడిలా తన కుటుంబ సభ్యులతో కలిసి పోలింగ్ బూత్ వద్ద లైన్ లో నిలుచున్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నితిన్, రాణా, రాజమౌళి, శ్రీకాంత్, తేజ, నాగార్జున, నాగ చైతన్య, అమల, రాఘవేంద్రరావు, విక్టరీ వెంకటేశ్.. ఇలా ప్రముఖులు అందరూ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తప్పకుండా ఓటు వేయాలంటూ తమ అభిమానులకు పిలుపునిచ్చారు.