సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు - చంద్రబాబు నాయుడు నాకు గురువు కాదు సహచరుడు మాత్రమే

సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు - చంద్రబాబు నాయుడు నాకు గురువు కాదు సహచరుడు మాత్రమే

ముద్ర,తెలంగాణ:- తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుతో అనుబంధం పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. శిష్యుడి కోసం చంద్రబాబు తెలంగాణలో పోటీ చేయడం చేయలేదు అని.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో పోటీ చేస్తున్న గురువుకు శిష్యుడి సహకారం ఉంటుందా అని ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నించగా.. దీనికి సీఎం రేవంత్ రెడ్డి స్పందిస్తూ.. చంద్రబాబు నాయుడు టీడీపీ అధ్యక్షుడు. నేను ఆయన సహచరుడిని. స్వతంత్ర ఎమ్మెల్సీగా గెలిచి టీడీపీలోకి వెళ్లాను. ఎవ్వరో బుద్దిలేని వాడు శిష్యుడు, గురువు అని మాట్లాడుతున్నాడని వ్యాఖ్యానించారు.