హైదరాబాద్​ లో కమ్ముకున్న మేఘాలు...పలు ప్రాంతాల్లో వర్షం

హైదరాబాద్​ లో కమ్ముకున్న మేఘాలు...పలు ప్రాంతాల్లో వర్షం

ముద్ర,హైదరాబాద్:- ఉదయం నుంచి ఉక్కబోత, వేడిగాలులతో ఉన్న వాతావ‌ర‌ణం ఒక్క‌సారిగా చ‌ల్ల‌బ‌డింది.నగరమంతా చల్లటి వాతావరణం నెలకొంది. నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. కర్మన్‌ఘాట్, చంపాపేట్, ఎల్బీనగర్, నాగోల్‌లో వర్షం కురుస్తోంది. ఈ ప్రాంతాలతో పాటు.. దిల్‌సుఖ్‌నగర్, చైతన్యపురి, సైదాబాద్, సంతోష్‌నగర్, మలక్‌పేట్ పరిసర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది.

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో కురుస్తున్న వర్షం మరికాసేపట్లో నగరం వ్యాప్తంగా విస్తరించే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. భాగ్యనగరంలోనే కాదు.. తెలంగాణ వ్యాప్తంగా జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరో రెండు గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఆయా జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.