ఇమ్రాన్ ఖాన్ విడుదలకు ఐక్యరాజ్యసమితి డిమాండ్

ఇమ్రాన్ ఖాన్ విడుదలకు ఐక్యరాజ్యసమితి డిమాండ్

ఇస్లామాబాద్ : నిర్బంధంలో ఉన్న పాకిస్థాన్ మాజీ ప్రధాని,  పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ వ్యవస్థాపకుడు ఇమ్రాన్ ఖాన్‌ను తక్షణమే విడుదల చేయాలని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కార్యవర్గం పిలుపునిచ్చింది. "అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించి ఏకపక్షంగా" ఆయనను ప్రభుత్వం నిర్బంధించిందని పేర్కొంది. ఆగస్టు 2023 నుంచి ఆయన జైలులో ఉన్నారు. అతను కనీసం 150 క్రిమినల్ కేసులలో దోషిగా ప్రభుత్వం పేర్కొంది. జైలులో ఉన్నందున ఫిబ్రవరి 8 ఎన్నికలలో పోటీ చేయడానికి అనర్హునిగా ప్రభుత్వం ప్రకటించింది.

 71 ఏళ్ల ఇమ్రాన్ గత ఏడాది ఆగస్టు నుంచి కటకటాల వెనుక ఉండి ఫిబ్రవరి సార్వత్రిక ఎన్నికలకు ముందు వరుస కేసుల్లో దోషిగా తేలింది. అవినీతి ఆరోపణలపై గత ఏడాది శిక్ష పడిన పాక్ ప్రధాని కేసును పరిశీలించిన తర్వాత ఏకపక్ష నిర్బంధంపై UN వర్కింగ్ గ్రూప్ బృందం ఈ డిమాండ్ చేసింది. ఇమ్రాన్‌ను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ, ఇది "తగిన పరిహారం" అని పేర్కొంది. తోషాఖానా అక్రమాస్తుల కేసులో ఇమ్రాన్‌ను దోషిగా నిర్ధారించడం "సాధారణంగా పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (PTI )ని లక్ష్యంగా చేసుకుని అణచివేతకు సంబంధించిన చాలా పెద్ద ప్రచారంలో భాగమని" ఆ బృందం పేర్కొంది.