ఇటలీలో నౌక మునిగి 40 మంది దుర్మరణం

ఇటలీలో నౌక మునిగి 40 మంది దుర్మరణం
The refugee boat ended up off the coast of southern Italy

శరణార్థుల నౌక దక్షిణ ఇటలీ సముద్ర తీరంలో ముగిపోయింది. ఈ ఘటనలో దాదాపు 40 మంది శరణార్థులు మృత్యువాతపడ్డారు. మరికొందరు ప్రాణాలతో బయటపడ్డారు. కాలాబ్రియా  ప్రాంతంలోని తీరపాంత్ర పట్టణమైన క్రోటోన్‌ సమీపంలో సుమారు వంద మంది ఉన్న నౌక లంగర్‌ వేసేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో పడవ ప్రమాదవశాత్తు భారీ బండరాయిని ఢీకొట్టి మునిగిపోయినట్లు సమాచారం. ఇందులో దాదాపు 40 మంది వరకు మృతి చెందారని, రిస్టార్‌ బీచ్‌లో మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఘర్షణలు, పేదరికం కారణంగా పెద్ద సంఖ్యలో ఏటా ఆఫ్రికా నుంచి ఇటలీకి వలసవెళ్తున్నారు.

ఈ క్రమంలో శరణార్థులతో వెళ్తున్న పడవలు నీటి పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే, నీటమునిగిన నౌక ఎక్కడి నుంచి వచ్చిందనే విషయంలో స్పష్టత లేదని అడ్‌క్రోనోస్‌ వార్త సంస్థ తెలిపింది. ఇందులో ఇరాన్‌, ఆఫ్ఘనిస్తాన్‌, పాక్‌కు చెందిన వారు ఉన్నారని, కఠిమైన వాతావరణ పరిస్థితుల్లో భారీ బండరాయిని ఢీకొట్టి నౌక నీట మునిగిందని పేర్కొంది. ప్రమాదం జరిగిన సమయంలో దాదాపు వంద మంది వరకు పడవలో ఉన్నట్లు తెలిపింది. పరిమితికి మంచి ఓడలో ప్రయాణిస్తున్నట్లుగా తెలిపింది. ఇటాలియన్‌ అధికారులు రెస్క్యూ ఆపరేషన్‌ చేపట్టినట్లు కాలాబ్రియాలోని ఫైర్‌ సర్వీసెస్‌ ప్రతినిధి డానిలో మైదా తెలిపారు. ఇదిలా ఉండగా.. 2014 నుంచి సెంట్రల్‌ మధ్యధరా సముద్రంలో దాదాపు 20వేల మంది వరకు మరణించారు.