బోటు ప్రారంభించి విహరించిన మంత్రి హరీష్ రావు

బోటు ప్రారంభించి విహరించిన మంత్రి హరీష్ రావు
Minister Harish Rao started the boat and took a tour

ఎమ్మెల్యే పద్మ కలెక్టర్ రాజర్శి షా
ముద్ర ప్రతినిధి, మెదక్: మెదక్ పట్టణం కోసముద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన బోటును రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ఆదివారం ప్రారంభించారు. స్థానిక ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి, కలెక్టర్ రాజర్షిషా, అడిషనల్ కలెక్టర్ ప్రతిమాసింగ్ లతో కలిసి గోసముద్రంలో విహరించారు. కోసముద్రంను 10 కోట్లు వెచ్చించి సుందరీకరిస్తామని ప్రకటించారు ఈ పనులు మూడు నెలలు పూర్తి చేస్తామన్నారు. సెలవు దినాలలో కుటుంబ సభ్యులతో కలిసి ఆహ్లాదకరంగా గడిపే వాతావరణం కల్పిస్తామని మంత్రి తెలిపారు. పర్యాటకులు బోటును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

బస్తీ దవాఖాన ప్రారంభం
మెదక్ పట్టణంలో గోల్కొండ వీధిలో అంబేద్కర్ కాలనీలో నూతనంగా నిర్మించిన బస్తీ దవాఖానను మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. వ్యాయపరిచారు. బస్తీ దవాఖానాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జీవో 58,59  క్రింద ప్రభుత్వ భూములను క్రమబద్ధీకరించబడిన అసైన్మెంట్ పట్టా పత్రాలను లబ్ధిదారులకు మంత్రి హరీష్ రావు,  ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి చేతులు మీదుగా లబ్ధిదారులకు పంపిణీ చేశారు.

మంత్రి రాక నేపథ్యంలో మంబోజిపల్లి ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో  గజమాలతో బిఆర్ఎస్ నాయకులు గజమాలతో సత్కరించారు. అక్కడి నుండి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజర్షి షా,అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్, ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్ రెడ్డి, మెదక్ ఆర్డీవో సాయిరాం, తహసీల్దార్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.