పంచాయతీల బిల్లులు క్లియర్

పంచాయతీల బిల్లులు క్లియర్
  • మిగతా పనులు వేగం పెంచాలి
  • కలెక్టర్ రాజర్షి షా


ముద్ర ప్రతినిధి, మెదక్: గ్రామ పంచాయతీలకు సంబంధించి బిల్లులు క్లియర్ అయినందున మిగతా పనులు వేగంగా చేయించాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. సోమవారం అధికారులతో వివిధ కార్యకమాలను సమీక్షిస్తూ
మన ఊరు -మన బడి కార్యక్రమంలో భాగంగా ఉపాధి హామీ పధకం క్రింద అన్ని పనులు మొదలు పెట్టేలా  సర్పంచులను, స్కూల్ మేనేజిమెంట్ కమిటీని ప్రోత్సహించాలన్నారు. వైకుంఠ ధామాలలో చేతి పంపుల ఏర్పాటు, మోటార్ల బిగింపు, విద్యుత్ సౌకర్యం కల్పించి అన్ని వినియోగంలో తెచ్చేలా జిల్లా పంచాయతీ, విద్యుత్ శాఖాధికారులు సమన్వయంతో పనిచేయాలని కోరారు. అదేవిధంగా మిగిలిపోయిన తెలంగాణ క్రీడా ప్రాంగణాలు సత్వరమే ఏర్పాటయ్యేలా చూడాలన్నారు. మండలాలలో ఏర్పాటు చేస్తున్న సమావేశాలల్లో వివిధ పనుల పురోగతిని సమీక్షిస్తూ పనులు పరుగుపెట్టించాలన్నారు. ప్రతి మండల ప్రత్యేకాధికారి వారంలో కనీసం రెండు కంటి వెలుగు శిబిరాలను, మంగళ వారం ఆరోగ్య మహిళా కేంద్రాన్ని సందర్శించి మెరుగ్గా శిబిరాలు నిర్వహించేలా పర్యవేక్షించాలన్నారు.

సోమవారం నుండి బుధవారం వరకు మండల స్థాయిలో  నిర్వహించే సి.ఎం కప్-2023 విజయవంతానికి కృషిచేయాలన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా  చూడాలన్నారు. వానాకాలంలో రైతులకు ఎరువుల కొరత  రాకుండా రేక్ పాయింట్ ద్వారా ఎరువుల రవాణా,   గోదాములలో భద్రపర్చుటపై  పర్యవేక్షణ చేస్తుండాలని జిల్లా వ్యవసాయాధికారి సూచించారు. రైతులు ఎఫ్ఎక్యూ నిబంధనల మేరకు నాణ్యమైన  ధాన్యం  కొనుగోలు కేంద్రాలకు తెచ్చేలా వ్యవసాయ విస్తరణాధికారులు అవగాహన కలిగించాలన్నారు. 


ఈ సమావేశంలో జిల్లా అధికారులు వెంకట శైలేష్, శ్రీనివాస్, జయరాజ్, విజయ శేఖర్ రెడ్డి, కృష్ణ మూర్తి, జెంలా నాయక్, రవి ప్రసాద్, రాధాకిషన్, కమలాకర్,  సాయిబాబా, శంకర్, రజిని, విజయలక్ష్మి, ఆశా కుమారి, బ్రహ్మాజీ , కరుణ, ఇందిర, డా.నవీన్, ,కలెక్టరేట్ ఏ.ఓ. యూనుస్ తదితరులు పాల్గొన్నారు.విజ్ఞప్తుల స్వీకరణప్రజా సమస్యల పరిష్కారం దిశగా అధికారులు  కృషి చేయాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు.  ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణికి  అదనపు కలెక్టర్ రమేష్ తో కలిసి జిల్లాలోని వివిధ  ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి 68 వినతులు స్వీకరించారు.