Ram Charan: గుండుతో కనిపించిన క్లీంకార... ఉపాసన పోస్ట్ వైరల్!

Ram Charan: గుండుతో కనిపించిన క్లీంకార... ఉపాసన పోస్ట్ వైరల్!
  • థాయ్ లాండ్ లో ఏనుగుల రెస్క్యూ క్యాంప్ ను సందర్శించిన రామ్ చరణ్ ఫ్యామిలీ
  • ఓ ఏనుగుకు పైపుతో నీళ్లు పట్టిన రామ్ చరణ్
  • చంకలో చంటిపిల్లతో ఉపాసన... ఆకట్టుకుంటున్న ట్వీట్

మెగా కోడలు ఉపాసన సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్టు పంచుకున్నారు. అందులో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్... ఎండవేడిమిని తట్టుకోలేని ఓ పిల్ల ఏనుగుకు పైపుతో నీళ్లు పడుతూ వేసవి తాపం తీర్చుతుండడాన్ని చూడొచ్చు. కుటుంబ సమేతంగా తాము ఓ ఏనుగుల సంరక్షణ కేంద్రాన్ని సందర్శించామని ఉపాసన పేర్కొన్నారు. థాంక్యూ మిస్టర్ సి... అద్భుతమైన అనుభవాన్ని అందించారు... ఈ ఏనుగుల రెస్క్యూ క్యాంప్ లో ఎంతో నేర్చుకున్నాం అంటూ ట్వీట్ చేశారు. కాగా, ఈ ఫొటోలో క్లీంకార గుండుతో కనిపిస్తోంది. అమ్మ ఉపాసన చంకనెక్కిన క్లీంకార... నాన్న రామ్ చరణ్ చేస్తున్న పనిని ఆసక్తిగా గమనిస్తూ ఉంది.

రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ కు బ్రేక్ రావడంతో కుటుంబ సమేతంగా రామ్ చరణ్ థాయ్ లాండ్ వెళ్లారు. బ్యాంకాక్ లోని ఓ ఏనుగుల సంరక్షణ కేంద్రాన్ని సందర్శించిన సందర్భంగానే ఉపాసన పైవిధంగా స్పందించారు.