రాజ్యాంగ స్ఫూర్తి కొనసాగితేనే సమాజంలో సమానత్వం

రాజ్యాంగ స్ఫూర్తి కొనసాగితేనే సమాజంలో సమానత్వం
  • అంబేద్కర్ కు అంజలి ఘటించిన మాజీమంత్రి మల్లారెడ్డి

బోడుప్పల్, ముద్ర ప్రతినిధి: సమాజంలో సమానత్వం రావాలంటే రాజ్యాంగస్ఫూర్తిని కొనసాగించాల్సిన అవసరం వుందని మేడ్చల్ ఎమ్మెల్యే, మాజీమంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. రాజ్యాంగ నిర్మాత, బాబాసాహెబ్ అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా బోడుప్పల్ లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రజలంతా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అనంతరం మల్లారెడ్డి బోడుప్పల్ బీఆర్ఎస్ (BRS) పార్టీ  కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీఆర్ఎస్ పార్టీ బోడుప్పల్ శాఖ అధ్యక్షుడు మంద సంజీవరెడ్డి మాట్లాడుతూ ప్రపంచంలోనే ఎత్తయిన 125 అడుగుల ఎత్తయిన అంబేద్కర్ విగ్రహం హైదరాబాద్ లో వుండడం మనందరికీ గర్వకారణమని అన్నారు. సంజీవరెడ్డితో పాటు బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ సామల బుచ్చిరెడ్డి, కార్పొరేటర్ చీరాల నర్సింహా, పార్టీ ప్రధాన కార్యదర్శి మీసాల కృష్ణ, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కొత్త చక్రపాణి గౌడ్, శ్రీధర్ గౌడ్, విశ్వనాథ్, నగేష్ గౌడ్, కో ఆప్షన్ సభ్యుడు బ్రహ్మన్న గౌడ్, పార్టీ నాయకులు మైసగల్ల మల్లేష్, శ్రీహరి, కీర్తన్ రెడ్డి, మోతె రాజు, మైసగల్ల శ్రీకాంత్, బొల్లం శశి తదితరులు పాల్గొన్నారు.