కేంద్రం లో మళ్లీ అధికారం మాదే.. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి..

కేంద్రం లో మళ్లీ అధికారం మాదే.. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి..

ముద్ర ప్రతినిధి, మేడ్చల్: రానున్న ఎన్నికల్లోకేంద్రంలో బీజేపీ పార్టీ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని కేంద్ర భూగర్బ, ఘనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ధీమా వ్యక్తంచేశారు. మల్కాజ్ గిరి నియోజక వర్గంలోని నేరెడ్మెట్ లో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎవరెన్ని జిమ్మిక్కులు చేసినా 2024 పార్లమెంటు ఎన్నికలలో తమ పార్టీ విజయాన్ని ఆపలేరని అన్నారు. దేశ చరిత్ర లోనే ఎన్నడూ లేని విధంగా తమ హయాంలోనే దేశం అన్ని రంగాలలో అభివృద్ధి సాధించిందని తెలిపారు. మోదీ సర్కార్ తొమ్మిదేళ్ళ పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో నిర్వహిస్తున్న మహాజన్ సంప ర్కు అభియాన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పార్టీ నేతలకు సూచించారు.

తెలంగాణ లో కొనసాగుతున్న కుటుంబ పాలనకు త్వరలోనే చరమగీతం పాడేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఈ సారి ఎన్నికలలో తెలంగాణ లోనూ బీజేపీ పార్టీ గెలిచి తీరుతుందని మంత్రి ధీమా వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఎన్ వీ ఎస్ ఎస్ ప్రభాకర్, మేడ్చల్ అర్భన్ జిల్లా అధ్యక్షుడు పన్నాల హరీష్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.