నిరుపేదలకు వరం సీఎంఆర్ఎఫ్ - ఎమ్మెల్యే కేపి వివేకానంద్

నిరుపేదలకు వరం సీఎంఆర్ఎఫ్ - ఎమ్మెల్యే కేపి వివేకానంద్

కుత్బుల్లాపూర్(ముద్ర నే2స్): కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధికి చెందిన 31 మంది సీఎంఆర్ఎఫ్ పథకం లబ్ధిదారులకు రూ.22,61,000/- విలువ చేసే చెక్కులను ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ప్రభుత్వం ద్వారా మంజూరు చేయించి ఈరోజు చింతల్ లోని తన కార్యాలయం వద్ద పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమమే ధ్యేయంగా పథకాలు అమలు చేస్తున్నదని అన్నారు. అనారోగ్యాలతో ఆసుపత్రుల పాలైన నిరుపేదలకు సీఎంఆర్ఎఫ్ వరంలా మారిందని అన్నారు. తమ ప్రభుత్వం నిరుపేదల ఆరోగ్య భద్రతకు వేలాది కోట్ల రూపాయలు వెచ్చిస్తోందన్నారు. అనారోగ్యాల భారినపడి ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొంది సంబంధిత ధ్రువీకరణ పత్రాలతో దరఖాస్తు చేసుకున్న వారికి సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆర్థిక చేయూతను అందిస్తున్నామన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజలు తప్పక సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రజా ప్రతినిధులు, డివిజన్ల అధ్యక్షులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.