పిపి నగర్ ఓపెన్ నాలాను పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ 

పిపి నగర్ ఓపెన్ నాలాను పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ 

కుత్బుల్లాపూర్(ముద్ర న్యూస్): కుత్బుల్లాపూర్ నియోజకవర్గం: గాజులరామారం డివిజన్ పరిధి ప్రకాశం పంతులు నగర్ లోని ఓపెన్ నాలాను బీజేపీ రాష్ట్ర నాయకులు, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్  బీజేపీ నేతలు, కాలనీ వాసులతో కలిసి పరిశీలించారు. నాలా పరిసర ప్రాంతాల్లో పడివేసిన చెత్తను మున్సిపల్ అధికారులు తొలగించకపోవడంతో దుర్వాసన వస్తుందని స్థానికులు మాజీ ఎమ్మెల్యే  దృష్టికి తీసుకొచ్చారు. అక్కడే మున్సిపల్ అధికారులకు శ్రీశైలం గౌడ్ గారు ఫోన్ చేసి చెత్తను తొలగించి, నాలా లో పూడిక తీయాలని హెచ్చరించారు. ఈ సందర్బంగా మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ... నాలాలో పూడిక తీయకపోవడంతోనే చెత్త పేరుకుపోయి దుర్వాసన రావడంతో స్థానిక ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని  అన్నారు. అధికారులు స్పందించి సత్వర చర్యలు చేపట్టకపోతే మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా చేపడతామని ఆయన హెచ్చరించారు. 

ఈ కార్యక్రమంలో పిపి నగర్ కాలనీ మాజీ అధ్యక్షుడు బ్రహ్మయ్య, కాలనీ వాసులు బుజ్జి, చంద్రకాంత్, విజయ్, భీమేశ్వర రావ్, సుఖ్ దేవ్, పాండు, దత్తు పాటిల్, జగదీశ్, కృష్ణ, మన్మద్, శేఖర్, సంజయ్, వినయ్ సింగ్, సతీష్,దత్తాత్రేయ మరియు స్థానిక బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు