ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కి బిగ్ షాక్...

ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కి బిగ్ షాక్...
  • కాలేజీ భవనం అక్రమ నిర్మాణాన్నికూల్చివేస్తున్న  అధికారులు....

ముద్ర ప్రతినిధి, మేడ్చల్:- మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజక వర్గం దుండిగల్ పురపాలక సంఘం పరిధిలోని మర్రి రాజశేఖర్ రెడ్డి కి చెందిన ఏరోనాటికల్ (ఎం.ఎల్.ఆర్.ఐ.టి) ఇంజనీరింగ్ కాలేజీ భవనాన్ని ఈ రోజు ఉదయం జిల్లా అధికార యంత్రాంగం కూల్చివేతలకు పూనుకుంది. చిన్న దామర చెరువును కబ్జా చేసి అక్రమ కట్టడాలు కట్టారని వచ్చిన ఫిర్యాదు మేరకు కలెక్టర్ ఆదేశాలతో దుండిగల్ మండల, రెవెన్యూ ఇరిగేషన్ మున్సిపల్ శాఖల అధికారుల ఆధ్వర్యంలో భారీ బందోబస్తు మధ్య కూల్చివేతలు చేపట్టారు. ఈ సందర్భంగా కాలేజీ విద్యార్థులు వందలాది మంది బయటకు వచ్చి కూల్చివేతలకు అడ్డుపడటం తో కొద్దిసేపు అక్కడ తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎమ్మెల్యే లు మర్రి రాజశేఖర్ రెడ్డి, వివేకానంద, ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు తదితరులు సంఘటనా స్థలానికి చేరుకొని కూల్చివేతలు ఆపాలని అధికారులను  కోరారు.