Ambati Rayudu: రాజకీయాల నుంచి తప్పుకోవడానికి కారణం ఇదే: అంబటి రాయుడు

Ambati Rayudu: రాజకీయాల నుంచి తప్పుకోవడానికి కారణం ఇదే: అంబటి రాయుడు
  • డిసెంబరు 28న వైసీపీలో చేరిన క్రికెటర్ అంబటి రాయుడు
  • పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు నిన్న ప్రకటన
  • తీవ్ర చర్చనీయాంశంగా మారిన రాయుడి వ్యవహారం
  • గుంటూరు ఎంపీ టికెట్ ఇవ్వనందువల్లే రాజీనామా అంటూ కథనాలు

ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు వైసీపీకి రాజీనామా చేయడం ఇప్పటికీ ప్రకంపనలు సృష్టిస్తోంది. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరి రెండు వారాలు కూడా గడవకముందే రాయుడు పార్టీని వీడడం తీవ్ర చర్చకు దారితీసింది. గుంటూరు ఎంపీ సీటు ఇవ్వనందువల్లే రాయుడు వైసీపీని వదిలేశాడని ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారానికి తెరదించేందుకు రాయుడు స్వయంగా రంగంలోకి దిగాడు. 

"నేను ఇంటర్నేషనల్ లీగ్ టీ20 పోటీల్లో పాల్గొంటున్నాను. జనవరి 20 నుంచి దుబాయ్ లో జరిగే ఈ పోటీల్లో నేను ముంబయి ఇండియన్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నాను. అయితే, ఈ టోర్నీలో పాల్గొనే ప్రొఫెషనల్ ఆటగాళ్లకు ఎలాంటి రాజకీయ సంబంధాలు ఉండకూడదన్న నిబంధన ఉంది" అంటూ రాయుడు ట్వీట్ చేశాడు.