Jagan London trip cancelled సీఎం జగన్​ లండన్​ పర్యటన రద్దు...? 

Jagan London trip cancelled సీఎం జగన్​ లండన్​ పర్యటన రద్దు...? 

సీఎం జగన్​ లండన్​ పర్యటన రద్దయినట్లు సమాచారం. వివేకా హత్య కేసులో భాస్కర రెడ్డి అరెస్టు నేపథ్యంలో జగన్​ లండన్​ పర్యటన రద్దు చేసుకున్నట్లు తెలిసింది. ఈ నెల 21న కుటుంబసభ్యులతో లండన్​ పర్యటనకు సన్నాహాలు చేసుకున్నారు. విజయవాడ నుంచి ముంబైకి ప్రత్యేక విమానంలో వెళ్ళి అక్కడి నుంచి విమానంలో లండన్​ వెళ్లడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. లండన్​లో ఉన్న తమ కుమార్తెల వద్దకు వెళ్ళడానికి జగన్​ దంపతులు నిర్ణయించుకున్నారు. వివేకా కేసు పరిణామాల వల్ల జగన్​ పర్యటన రద్దయినట్లు సమాచారం.