ఘోర రోడ్డు ప్రమాదం

వరంగల్ నుండి కరీంనగర్ వెళ్తున్న డీజిల్ ట్యాంకర్ తాడికల్ బస్టాండ్ వద్ద నిలబడి ఉన్న ఉన్న ఆరుగురుని ఢీ కొట్టింది. అదుపుతప్పిన ట్యాంకర్ పూదరి శ్రీనివాస్ అనే వ్యక్తిపై బోల్తాపడగా ఆయన అక్కడికక్కడే మరణించారు.

ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కరీంనగర్ ప్రధాన ఆసుపత్రికి తరలిస్తున్నారు. మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది. గ్రామస్తులు టాంకర్ డ్రైవర్ క్లీనర్ లను గ్రామపంచాయతీలో బంధించారు.