సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ ఉద్యోగి సస్పెండ్

సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ ఉద్యోగి సస్పెండ్

ముద్ర ప్రతినిధి, నిర్మల్: అక్రమాలకు పాల్పడ్డారనే అభియోగంతో నిర్మల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ గా పని చేస్తున్న ఐజాక్ ను సస్పెండ్ చేస్తూ ఆదివారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు.  ఆయన ఇటీవల ఇన్చార్జి సబ్ రిజిస్ట్రార్గా పదవీ బాధ్యతలు నిర్వహించిన సమయంలో నిబంధనలను అతిక్రమించి రిజిస్ట్రేషన్లకు పాల్పడ్డారని  ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో సాధారణ ఆడిటింగ్ లో భాగంగా తనిఖీ చేసిన నేపథ్యంలో ఇవి వెలుగులోకి వచ్చాయి. దీంతో ఆయనను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. గతంలో కూడా అవినీతి ఆరోపణలపై ఇద్దరు కార్యాలయ సిబ్బంది ఏసీబీ వలలో చిక్కుకున్న విషయం తెలిసిందే.