స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా - ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ కుమార్ రెడ్డి

స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా -  ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ కుమార్ రెడ్డి

ముద్ర/షాద్ నగర్- స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల సమస్యలను పరిష్కరించేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి అన్నారు. మంగళవారం ఫరూక్నగర్ మండల పరిధిలోని ఎలికట్ట గ్రామ సమీపంలో ఉన్న శ్రీ భవాని మాత అమ్మవారి దేవాలయంలో ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పూజారులు పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. ఎమ్మెల్సీగా విజయం సాధించి మొదటిసారిగా దేవాలయానికి వచ్చిన సందర్భంగా ఆలయ అర్చకులు పూలమాలలతో ఘనంగా సత్కరించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనపై నమ్మకం పెట్టి ఓట్లు వేసిన ఎంపిటిసిలకు, జడ్పిటిసి లకు, మున్సిపల్ చైర్మన్ లకు, కౌన్సిలర్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. స్థానిక ప్రజాప్రతినిధుల సమస్యలను శాసనమండలిలో ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్ళనున్నట్లు వివరించారు. ప్రజా ప్రతినిధుల సమస్యలపై నిరంతరం పోరాటం చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఏ సమస్య ఉన్న తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కరించేందుకు కృషి చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి, కడంపల్లి శ్రీనివాస్ గౌడ్, శివ చారి తోపాటు కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.