దస్తావేజు లేఖరులకు లైసెన్స్‌ ఇవ్వాలి

దస్తావేజు లేఖరులకు లైసెన్స్‌ ఇవ్వాలి
  • న్యాయం చేయాలనీ వినతి పత్రం
  • జిల్లా దస్తావేజు లేఖరుల సంఘం

ముద్ర, షాద్ నగర్: దస్తావేజు లేఖర్లకు లైసెన్సు లు మంజూరు చేయాలని కోరుతూ జిల్లా దస్తావేజు లేఖరుల సంఘం డిమాండ్ చేసింది. సోమవారం జిల్లా సంఘం ఆధ్వర్యంలో సబ్ రిజిస్టార్లకు వినతిపత్రం అందజేశారు.కుంభకోణాలకు నిలయంగా మారిన రిజిస్ట్రేషన్లు–స్టాంపుల శాఖను ప్రక్షాళన చేసే దిశగా అప్పటి  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చర్యలు చేపట్టే దిశగా 2001 సంవత్సరంలో దస్తావేజు లేఖరుల లైసెన్సులు రద్దు చేశారని, కానీ ఇప్పటికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ప్రభుత్వాలు మారిన తమ సమస్య మాత్రం తీరలేదని దస్తావేజుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు వెంకటయ్య, వాహబ్ ఖాన్, పట్టణ అధ్యక్షులు ఒగ్గు కిషోర్, ఆదామ్, అనిల్, చిట్టి బాబు, మెడికల్ చిట్టి బాబు, రహమాన్, సంతోష్, శ్రీకాంత్ రెడ్డి, చందర్ రాజులు అన్నారు.

రిజిస్ట్రేషన్లలో కీలకమైన దస్తావేజులను రాసే బాధ్యతలను అర్హత కలిగిన వ్యక్తులకు అప్పగించాలని... దస్తావేజు లేఖరు ల (డాక్యుమెంట్‌ రైటర్‌)కు లైసెన్సులు ఇవ్వడం ద్వారా అక్రమాలకు చెక్‌ పెట్టాలని అప్పట్లో ప్రభుత్వాలు నిర్ణయించాయని, వాస్తవానికి 2000 సంవత్సరానికి ముందు రిజిస్ట్రేషన్ల శాఖలో లైసెన్స్‌డ్‌ దస్తావేజుల లేఖరులు ఉండేవారని వివరించరు, ఆ తర్వాత ‘కార్డ్‌ విధానాన్ని ప్రవేశపెట్టడంతో అప్పటి ప్రభుత్వం దస్తావేజు లేఖరులను తొలగించిందనీ ఆందోళన వ్యక్తంచేశారు. ఆనాటి సర్కారు తీసుకున్న ఈ నిర్ణయం తర్వాత రిజిస్ట్రేషన్ల శాఖలో దళారులకు మంచి అవకాశంగా మారిందనీ దళారులు డబ్బు ఆశ చూపుతుండడంతో కొందరు  భారీ స్థాయిలో అక్రమాలకు వెనుకాడటంలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 3వేల మందికి పైగా నిరుద్యోగులకు అవకాశం లభించవచ్చని అప్పట్లో అంచనా వేసింది. రాష్ట్రంలో వందలాది సబ్‌ రిజిస్ట్రార్, పెద్ద  సంఖ్యలో జిల్లా రిజిస్ట్రార్‌ కార్యాలయాలుండగా... ఒక్కొక్క కార్యాలయానికి కనీసం 15 మంది చొప్పున నియమించాలని ప్రభుత్వం అప్పట్లో సూచనప్రాయంగా భావించిందని పేర్కొన్నారు.

దీనికి కనీస అర్హత డిగ్రీ కాగా.. న్యాయశాస్త్రం (లా) అభ్యసించిన వారికి ప్రాధాన్యత ఇవ్వాలని రిజిస్ట్రేషన్ల శాఖ నిర్ణయానికి వచ్చిందని, దస్తావేజు రాసినందుకు రూ.10లక్షలలోపు విలువైన డాక్యుమెంట్‌కు, రూ.50 లక్షలలోపు ఇంత పైకం చొప్పున లేఖరులకు ఫీజు చెల్లించే వీలు కల్పిస్తున్నట్టు గత ప్రభుత్వాలు హామీలు కూడా గుప్పించాయని తెలిపారు.డాక్యుమెంట్‌ రైటర్లకు లైసెన్సులు ఇవ్వడం ద్వారా రిజిస్ట్రేషన్లలో జరిగే తప్పిదాలను నియంత్రి చక్రమంలో వారికి లైసెన్సులు జారీ చేయాలని ఆలోచన అమలు కాకపోవడం ఎంతోమందిని ఆందోళన గురి చేస్తుందని ఈ సందర్భంగా వారు వివరించారు. ఈ సందర్భంగా సబ్ రిజిస్టార్ కు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేసినట్టు పట్టణ అధ్యక్షులు ఒగ్గు కిషోర్ తెలిపారు