సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాల నియంత్రణ ఎస్పి రోహిణి ప్రియదర్శిని

సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాల నియంత్రణ ఎస్పి రోహిణి ప్రియదర్శిని

తూప్రాన్, ముద్ర: సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాల నియంత్రణ వేగవంతం అవుతుందని జిల్లా ఎస్పి రోహిణి ప్రియదర్శిని అన్నారు. మనోహరాబాద్ మండలం చెట్ల గౌరారం, రంగాయిపల్లి గ్రామాలలో ఎంఎస్ అగర్వాల్ పరిశ్రమ యాజమాన్యం సిఎస్అర్ నిధులు ఏడు లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఆమె ప్రారంభించారు. ప్రజలు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కెమెరాల వల్ల దొంగతనాలు, ఆక్సిడెంట్ లు జరిగినప్పుడు కేసు నిర్దారణ త్వరితగతిన చెదించడం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత ప్రమాణాలను పాటించాలని, హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించాలని ప్రజలకు సూచించారు. అనంతరం మొక్కలు నాటారు.  సీఐ శ్రీధర్, ఎస్ఐ సందీప్ రెడ్డి, మండల బిఆర్ఎస్ అధ్యక్షులు పురం మహేష్, వైస్ ఎంపీపీ విఠల్ రెడ్డి, సర్పంచ్ లు నర్సయ్య, నాగభూషణం, అర్జున్, ఉప సర్పంచ్ లు శ్రీహరి గౌడ్, నవీన్ నాయకులు చంద్రశేఖర్, వెంకట్ గౌడ్, శేఖర్ గౌడ్, రవి తదితరులు పాల్గొన్నారు.