జూన్ లో ఒకటి, జులైలో ఆరు వివాహానికి శుభ ముహూర్తాలు

జూన్ లో ఒకటి, జులైలో ఆరు వివాహానికి శుభ ముహూర్తాలు

Auspicious dates for Marriage: హిందూ వివాహ సంప్రదాయంలో ముహూర్తానికి ఎంత ప్రాధాన్యం వుందో తెలియనిది కాదు. శుభ ముహూర్తాల సమయంలోనే వివాహ కార్యక్రమాలు నిర్వహిస్తారు. జ్యోతిష పండితులను కలిసి వధూవరుల నక్షత్రాలను బట్టి వారికి అనుకూలమైన వివాహ ముహూర్తాలు నిర్ణయిస్తారు. గత కొంతకాలంగా సరైన వివాహ ముహూర్తాలు లేకపోవడంతో చాలా మంది శుభ ముహూర్తాల కోసం వేచి చూస్తున్నారు.

జూన్, జులై రెండు నెలల్లో వివాహానికి అనుకూలమైన కొన్ని తేదీలను జ్యోతిష పండితులు చెబుతున్నారు. జూన్ 29, జూలై 9, 11, 12, 13, 14, 15, తేదీల్లో శుభ ముహుర్తాలు ఉన్నాయని తెలిపారు. అయితే తర్వాత వచ్చే చాతుర్మాసం కారణంగా ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు మళ్లీ శుభ ముహూర్తాలు లేవని చెబుతున్నారు. మళ్లీ నవంబరు, డిసెంబర్ నెలలోనే పెళ్లి వంటి శుభకార్యక్రమాలకు ముహూర్తాలు ఉన్నాయట. అందువల్ల మీ ఇంట్లో ఎవరికైనా పెళ్లి చేయాలని భావిస్తే.. ఈ ముహూర్తాలను కచ్చితంగా గుర్తు పెట్టుకోండి. ఒక శుభ ముహూర్తాన్ని నిర్ణయించుకుని పెళ్లి పనులు మొదలు పెట్టుకోవచ్చు. మళ్లీ ఈ తేదీలు దాటిపోతే మళ్లీ మంచి ముహూర్తం కోసం వేచి చూడాల్సి ఉంటుంది.