దేశ రాజకీయాల్లో కోహినూర్ వజ్రం చంద్రబాబు

దేశ రాజకీయాల్లో కోహినూర్ వజ్రం చంద్రబాబు

టిడిపి జోన్ 2 కోఆర్డినేటర్ మందలపు రవి

(ముద్ర ప్రత్యేక ప్రతినిధి): హైదరాబాద్: వర్తమాన మన దేశ రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబునాయుడు కోహినూర్ వజ్రం లాంటివారని టిడిపి జోన్ 2 కోఆర్డినేటర్, ఎన్నారై మందలపు రవి అభివర్ణించారు. ఇటీవల రాష్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల కార్యకలాపాల్లో చంద్రబాబునాయుడు మందలపు రవికి టిడిపి జోన్ .. 2 కోఆర్డినేటర్ గా కీలకమైన బాధ్యతలు అప్పగించారు. కాగా రవి తనకు అప్పగించిన బాధ్యతలను దిగ్విజయంగా నిర్వహించారు. జోన్ 2 పరిధిలో పార్టీ తరఫున పోటీపడిన 5 మంది ఎంపీ అభ్యర్థులు, 35 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు విజయం సాధించారు. ఈ సందర్భంగా మందలపు రవి మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీపట్ల, చంద్రబాబు నాయుడు పాలనా సామర్ధ్యంపట్ల తనకు గల విశ్వాసాన్ని గౌరవాన్ని  వెల్లడించారు.  
 
నాలోని టాలెంట్ ను గుర్తించే బాధ్యతలు అప్పగించారు

    "నిజానికి నేను చదువుకున్నది మెకానికల్ ఇంజనీరింగ్.  మాస్వగ్రామం కృష్ణాజిల్లా పసుమర్రు. మాది వ్యవసాయ కుటుంబం. మా తాతగారు వ్యవసాయంకోసం కొత్తగూడెం వద్ద స్థిరపడ్డారు. ఉమ్మడి ఖమ్మంజిల్లాలో పుట్టిన నేను.. మెకానికల్ ఇంజనీరింగ్ చదివి, సారపాక ఐటిసిలో ఇంజనీర్ గా పనిచేశాను. ఆ తర్వాత 1998 సంవత్సరంలో ఉద్యోగ నిమిత్తం అమెరికాలో అడుగుపెట్టాను.  నాకు మొదటి నుంచీ తెలుగుదేశం పార్టీ అన్నాగానీ, చంద్రబాబునాయుడు పాలనా విధానాలుగానీ ఎంతో గౌరవం, విశ్వాసం. ఆనాడు పేదలకోసం తెలుగుదేశం పార్టీ పెట్టి చరిత్ర సృష్టించిన ఎన్టీఆర్ గారు ఒకరకమైన యుగపురుషుడైతే, చంద్రబాబునాయుడు ప్రపంచవ్యాప్త ఉపాధి అవకాశాల రంగమైన ఐటీ ప్రొఫెషనల్స్ ను ప్రోత్సహించి, సంపదను సృష్టించే విజనరీ పాలకుడిగా  ప్రపంచ వ్యాప్తంగా పేరు, ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు.

ఆ దూరదృష్టితోనో ఏమో అమెరికాలో మెకానికల్ ఇంజనీర్ గా ఉద్యోగం చేసుకుంటున్న నాకు కబురు పంపించి, ఎన్నికల్లో ఒక జోన్ ఏరియా రాజకీయ పరిస్థితుల, ప్రత్యర్థుల బలాబలాలను పసిగట్టే టిడిపి పార్టీ కోఆర్డినేటర్ గా బాధ్యతలు అప్పగించారు.  దీనికి మొదట నేను ఎంతో ఆశ్చర్యపోయాను. రాజకీయరంగానికీ, నేను చదువుకున్న మెకానికల్ ఇంజనీరంగ్ రంగానికీ ఏమాత్రం పొంతనలేని నాకు ఈ బాధ్యతలను ఎందుకు అప్పగించారో అర్ధంకాలేదు. కానీ మెకానికల్ ఇంజనీర్ గా యంత్రాల పనితీరు, వాటిలోని లోపాలు, లోగుట్టులు తెలుసున్న నేను, రాజకీయ నాయకుల్లో లోపలా బయటా ఉండే ఆలోచనలు, ఊహలు, వ్యూహాలను పసిగట్టడంపైకి మళ్ళించి, వాటిని సాంకేతికంగా ఛేదించి, ఎన్నికల్లో మా పార్టీ అభ్యర్థులు తప్పక గెలిచేలా పరిస్థితులను సృష్టించగలిగాను. అదీ నా టెక్నికల్ సీక్రెట్" అని రవి అన్నారు.

కోహినూర్ వజ్రం.. చంద్రబాబునాయుడు

 "ప్రస్తుత మనదేశ రాజకీయ, పాలనారంగాన్ని దూరదృష్టితో సంక్షేమం, సుసంపన్నం దిశగా నడిపించగల కోహినూర్ వజ్రం లాంటి నాయకుడు చంద్రబాబునాయుడు మాత్రమేనని నా అభిప్రాయం. ఇలా ఎందుకు చెపుతున్నానంటే..  ఇప్పడు ప్రపంచ దేశాలన్నిటిలో ఐటీ ప్రొఫెషనల్స్ కు ఉన్నంత గుర్తింపు, విలువ మరే ఇతర వృత్తులకూ లేవు. అటువంటి సంపన్నవంతమైన ఐటీ రంగానికి మన రెండు తెలుగు రాష్ట్రాలలో బాటలువేసి, సంపదను సృష్టించడంలో ఓ విజనరీ గ్లోబల్ లీడర్ గా చంద్రబాబు ఎదిగారు.  ఆయన తెలుగువారు కావడం మన కోహినూర్ వజ్రంగా కూడా మనం గొప్పగా చెప్పుకోవచ్చు. అటువంటి విజనరీ లీడర్ దగ్గర నేను సన్నిహితంగా పనిచేసి
సక్సెస్ సాధించడం అనేది నా జీవితంలో మర్చిపోలేని అద్భుత సంఘటన.  అంతేకాదు, అంతటి గొప్ప విజనరీ లీడర్ ను కంటికి రెప్పలా కాపాడుకుంటూ, ఆయన పాలనా ప్రతిభా ఫలాలను సంపాదించుకోవలసిన బాధ్యత మన రాష్ట్ర ప్రజలందరిపైనా ఉందని నా విన్నపం. 

చంద్రబాబు దగ్గర పనిచేయడమే.. నాకు ఒక గొప్ప పదవి

"ఇప్పుడు నేను రాజకీయరంగంలో సక్సెస్ సాధించాను కాబట్టి, ముందు ముందు నాకు కూడా ఏదో ఒక మంచి పదవి రావచ్చు. కానీ నాకు పదవి హోదా కన్నా, బాబు వంటి ఐకాన్ విజనరీ లీడర్ దగ్గర పనిచేయడమే నాకు  ఓ గొప్ప పదవిగా నేను గర్వపడతాను.  ఇక ఇప్పుడు చంద్రబాబునాయుడు నవ్యాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా రెండోసారి పాలనా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన సారధ్యంలో.. రాష్ట్రంలో ప్రగతిపధంలో దూసుకుపోనుంది.  అలాగే రాజధాని నగరం అమరావతి నిర్మాణం కూడా భావితరాలు సగర్వంగా చాటుకునేలా నిర్మాణం చేస్తారు. అలాగే రాష్ట్రానికి ప్రతిష్టాత్మకంగా చెప్పుకునే పోలవరం జాతీయ ప్రాజెక్టు కూడా విజయవంతంగా పూర్తయి, మన రైతన్నలు పచ్చని పైరు సంపదలతో ఆంధ్రప్రదేశ్ అంటే అన్నపూర్ణ అనే పేరును మరింత ఇనుమడింపచేసే రోజులు రానున్నాయి" అని రవి వ్యాఖ్యానించారు.