ప్రమాదంలో గాయపడిన కాంగ్రెస్ మీడియా ఇంచార్జ్ 

ప్రమాదంలో గాయపడిన కాంగ్రెస్ మీడియా ఇంచార్జ్ 

మహాదేవపూర్, ముద్ర: కాటారం మండల కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇంచార్జ్ బొడిగె శ్రీకాంత్, రత్నం మల్లయ్యలు బైక్ ప్రమాదంలో గాయపడి భూపాలపల్లి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. శ్రీపాద ట్రస్ట్ చైర్మన్ దుద్దిల్ల శ్రీను బాబు గాయపడిన వారిని పరామర్శించారు. బైక్ పై కాటారం గ్రామానికి చెందిన బొడిగె శ్రీకాంత్ మరియు యామన్ పల్లి గ్రామానికి రత్నం మల్లయ్య ప్రయాణిస్తుండగా అదుపుతప్పి కింద పడి ప్రమాదానికి గురయ్యారు.

విషయం తెలుసుకున్న శ్రీపాద ట్రస్ట్ చైర్మన్ దుద్దిల శ్రీనుబాబు భూపాలపల్లి కేంద్రంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బొడిగే శ్రీకాంత్, మల్లయ్యలను పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని మెరుగైన చికిత్సకై డాక్టర్లతో, ఆసుపత్రి యాజమాన్యంతో మాట్లాడారు. గాయపడిన వారు త్వరగా కోలుకునేలా చూడాలని కోరారు.