భూపాలపల్లిలో టీయుడబ్ల్యుజె(ఐజేయు) ఆందోళన..

భూపాలపల్లిలో టీయుడబ్ల్యుజె(ఐజేయు) ఆందోళన..

ముద్ర ప్రతినిధి, జయశంకర్ భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లాకేంద్రంలో టీయుడబ్ల్యుజె(ఐజేయు) జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఐజేయు ఇచ్చిన దేశవ్యాప్త ఆందోళన కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు జయశంకర్ భూపాలపల్లి జిల్లాకేంద్రంలో ఐజేయు జిల్లా అధ్యక్షుడు క్యాతం సతీష్ కుమార్ గాంధీ జయంతిని పురస్కరించుకుని, మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి, నివాళులు అర్పించి నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో మీడియా వ్యవస్థకు రక్షణ లేకుండా పోతుందని, ప్రభుత్వాలు ఎన్ని మారినా, మీడియాకు రక్షణ చట్టాలు తీసుకురావడంలో విఫలం చెందాయని, ఇప్పటికైనా ప్రభుత్వాలు మేల్కొని మీడియా రక్షణ చట్టాలను అమలుపరిచే విధంగా జీవోను తయారుచేసి మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని అన్నారు. అక్రిడిటేషన్ కలిగిన జర్నలిస్టులందరికీ రైల్వే పాసులను పునరుద్ధరించాలని, దేశంలో పనిచేస్తున్న జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టి జర్నలిస్టుల డిమాండ్లను నెరవేర్చుకుంటామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి శామంతుల శ్యామ్, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ సామల శ్రీనివాస్, టెమ్జు అధ్యక్షులు సాంబయ్య, సీనియర్ రిపోర్టర్ రాళ్ల బండి శ్రీనివాస్, ఐలయ్య, తాళ్లపెల్లి సమ్మయ్యగౌడ్, పల్నాటి రాజు, రమేష్, మల్లేష్, రడపాక రమేష్, మహేందర్, దూళం రవితదితరులు పాల్గోన్నారు.