జయశంకర్ జిల్లాకు చేరుకున్న కేంద్ర బృందం..

జయశంకర్ జిల్లాకు చేరుకున్న కేంద్ర బృందం..
  • వరద నష్టం పై అధికారులతో సమీక్ష...

ముద్ర ప్రతినిధి, జయశంకర్ భూపాలపల్లి:వరద నష్టంపై క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు బయలుదేరిన ఏడుగురు సభ్యులతో కూడిన కేంద్ర బృందం బుధవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చేరుకుంది. ఈ సందర్భంగా చెల్పూరులోని జెన్కో మీటింగ్ హాల్లో వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న పంటలు, దెబ్బతిన్న ఇళ్లు, రహదారులతో పాటు వివిధ శాఖలకు జరిగిన నష్టాన్ని శాఖల  వారీగా  జరిగిన  నష్టం అంచనా పై చర్చించారు.

కేంద్ర బృంద సభ్యులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్, వీడియోల ద్వారా జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా జిల్లాలో జరిగిన పరిస్థితులపై వివరించారు. అనంతరం వరదల కారణంగా భారీగా నష్టపోయిన మోరంచపల్లి గ్రామాన్ని సందర్శించి, క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు బయలుదేరి వెళ్లారు. ఈ సమావేశంలో కేంద్ర బృందం టీం లీడర్ కునాల్ సత్యార్థి (ఎన్ డి ఎం ఏ జాయింట్ సెక్రెటరీ), అనిల్ గైరోల (డిప్యూటీ సెక్రటరీ, మినిస్ట్రీస్ ఆఫ్ ఫైనాన్స్), ఎస్.కె. కుష్వా (రీజినల్ ఆఫీసర్ ఎన్. హెచ్), రమేష్ కుమార్ (డైరెక్టర్, మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి),పూను స్వామి (జాయింట్ డైరెక్టర్, మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్), జె.శ్రీనివాసులు (డైరెక్టర్, ఎన్ ఆర్ ఎస్సి  హైదరాబాద్), భవ్య పాండే (పవర్ డిపార్ట్మెంట్), జిల్లా కలెక్టర్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.