డబల్ బెడ్ రూమ్ ‘క్వారీ’ అంటే జేబులు నింపడమే

డబల్ బెడ్ రూమ్ ‘క్వారీ’ అంటే జేబులు నింపడమే
  • నేతల అధికారుల నజరానాల పంట
  • అన్నారం బ్యారేజ్ బుంగకు కారణమిదేనా?

మహాదేవపూర్, ముద్ర: కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అవ్వగానే అన్నారం బ్యారేజ్ కింద నదీ గర్భంలో నడుస్తున్న డబల్ బెడ్ రూమ్ క్వారీ నుండి అంతులేని ఇసుక లారీలు పర్మిట్లు ఉన్నా లేకున్నా పట్టణ మార్కెట్లో రాజ్యమేలుతున్నాయి. టి ఎస్ ఎం డి సి సాధారణ క్వారీలు నిర్వహించడంతోపాటు ప్రభుత్వ అవసరాల నిమిత్తం ఒక క్వారీని నిర్వహిస్తుంది. దానిని స్థానికంగా డబల్ బెడ్ రూమ్ క్వారీ అని పిలుస్తారు. ఇక్కడి నుండి రవాణా అయిన ఇసుక డబల్ బెడ్ రూమ్ నిర్మాణాలకు, ప్రభుత్వ పథకాలకు ఎంత ఉపయోగించారు అనేది లెక్కతీస్తే అవినీతి చిట్టా మొత్తం బయటకు వస్తుంది. అన్నారం క్వారీ నిర్వాహకులు టి ఎస్ ఎం డి సి ఆశీస్సులతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు లక్షలాది టన్నుల ఇసుకను తరలించారు. కోట్ల రూపాయల అవినీతి సొమ్మును కూడాబెట్టు కుంటున్నారు. ఇక్కడ టిఎస్ఎండిసి నిఘా ఎంత మాత్రం ఉండకపోగా టిఎస్ఎండిసి పై వచ్చే ఫిర్యాదులను చల్లపరిచెందుకు కూడా ముడుపులకు ఈ క్వారీని వాడుకుంటారని తెలుస్తుంది. నోరున్న గ్రామస్థాయి నాయకులతో పాటు పోలీసులకు, రవాణాశాఖ అధికారులకు, ఉన్నతాధికారులకు, బడానేతలకు పెద్ద ఎత్తున వాటాలు ఇవ్వడమే ఈ క్వారీ ప్రత్యేకత. హైదరాబాదులోని బడా బడా అపార్ట్మెంట్లకు, అధికారుల నేతల గృహావసారాలకు, ఓపెన్ మార్కెట్ లో విక్రయించేందుకు ఈ క్వారీకి అనధికారిక హక్కులుంటాయి.

నిర్వాహకులు కూడా పరిమితులు లేకుండా వందలాది సొంత లారీలను ఏర్పాటు చేసుకొని ఇసుక వ్యాపారంలోని అన్ని లెసకులను వాడుకుంటారు. ఇతర క్వారీలు అదనంగా తన్ను బకెట్ట్ ఇసుకను వేసి అడ్డగోలు లాభాలు ప్రార్థించడం పరిపాటి.ఇక్కడ మాత్రం లేకుండానే ఇసుక లారీలు పట్టణాలకు యదేచ్చగా వెళ్తుంటాయనేది బహిరంగ రహస్యమే. లాభాల పంటను పండించే ఈ క్వారీ నుండే అధికారులకు నేతలకు నియమితంగా లక్షలాది రూపాయల నజనాలు అందుతాయి. ఈ క్వారీపై ఎలాంటి ఫిర్యాదులు ఉండవు. ఉన్నా వెంటనే చేతులు తడిపేస్తారు. ఇక్కడి నుండి తరలి వెళ్లే ఇసుక ఎలాంటి ప్రభుత్వ పథకాలకు,ప్రభుత్వ పనులకు వాడనే వాడరంటే అతిశయోక్తి కాదు. అన్నారం ఇసుక  క్వారీ ప్రత్యేకత ఇలా ఉంటే మరోవైపు ఇక్కడి నుండి లెక్కపత్రం లేకుండా పర్యావరణ నిబంధన లను తుంగలో తొక్కి అన్నారం బ్యారేజ్ కు పట్టుమని పది మీటర్ల దూరంలోనే  నిబంధనలకు విరుద్ధంగా పెద్ద మొత్తంలో ఇసుకను తోడటంతో  బ్యారేజీ బుంగకు కారణమైందని ఆరోపణలు కూడా ఉన్నాయి. వెంటనే జిల్లా సాండ్ కమిటీ, మైనింగ్ అధికారులు విచారణ చేపడితే ఉన్న ప్రాజెక్టులను కాపాడుకునే వీలు కలుగుతుంది. ప్రాజెక్టులను దెబ్బతీసే స్థాయిలో ఇసుకను తోడటమే పనిగా పెట్టుకున్నట్టు ఈ ప్రాంత ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పటివరకు ఈ క్వారీ నుండి తోడిన ఇసుక విలువను ప్రభుత్వ పథకాలకు చేరువేసిన పరిమాణాన్ని పరిశీలిస్తే కోటానుకోట్ల రూపాయలు అవినీతి బయటికి రాక తప్పదని పలువురు గట్టిగా చెబుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ పథకాలను కొనసాగించేటేందుకు ప్రత్యేక క్వారీ నిర్వహించడం అవసరమా? అనేది ప్రజల నుండి వెలువడుతున్న ప్రశ్న. అన్నారం క్వారీ చింతామణి నూతన ప్రభుత్వాన్ని ప్రజలు చేస్తున్నారు.