రేజిలింగ్ పోటీలో లో వీపనగండ్ల విద్యార్థికి మొదటి బహుమతి

రేజిలింగ్ పోటీలో లో వీపనగండ్ల విద్యార్థికి మొదటి బహుమతి

ముద్ర.వీపనగండ్ల:-రాష్ట్రస్థాయిలో జరిగిన ఎస్ జి ఎఫ్ అండర్ 19 రెజ్లింగ్ పోటీలో వీపనగండ్ల గ్రామానికి చెందిన విద్యార్థి మదుగని శశింద్ర మొదటి స్థానం (గోల్డ్ మెడల్)లో విజయం సాధించారు. గ్రామానికి చెందిన మదుగని రాముడు,పెద్ద లక్ష్మి దంపతుల కుమారుడు మదుగని శశింద్ర యాదాద్రిభువనగిరి జిల్లా సర్వైల్ టీఎస్ ఆర్ జె సి గురుకుల కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతూ రెజ్లింగ్ పోటీలో పాల్గొన్నాడు. ఈనెల 18,19 తేదీలలో హైదరాబాదులోని జియాగూడ లో  రాష్ట్రస్థాయిలో జరిగిన ఎస్ జి ఎఫ్ అండర్ 19 రెజ్లింగ్ పోటీలో మదుగని శశింద్ర పాల్గొని మొదటి స్థానం (గోల్డ్ మెడల్)లో విజయం సాధించి,ఈనెల 24 న జాతీయ స్థాయి లో జరిగే రెజిలింగ్ పోటీలు లకు ఎంపిక కావడం జరిగింది. మారుమూల ప్రాంతానికి చెందిన వీపనగండ్ల విద్యార్థి రెజ్లింగ్ పోటీలో రాష్ట్రస్థాయిలో గోల్డ్ మెడల్ సాధించి జాతీయ స్థాయికి ఎంపిక కావడం పట్ల తల్లిదండ్రులు, గ్రామస్తులు, కళాశాల అధ్యాపకులు, మిత్రులు హర్షం వ్యక్తం చేస్తూ జాతీయ స్థాయి లో కూడా మొదటి స్థానంలో విజయం సాధించాలని ఆకాంక్షించారు.