సీతమ్మకు సిరిసిల్ల చీర...

సీతమ్మకు సిరిసిల్ల చీర...

ముద్ర ప్రతినిధి, రాజన్న సిరిసిల్ల : భద్రాచలంలో బుధవారం జరగనున్న  శ్రీ సీతా రాములోరి కళ్యాణానికి,  సీతమ్మకు సిరిసిల్ల చీర చేరనుంది. సిరిసిల్ల పట్టణానికి చెందిన చేనేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్ ప్రతి సంవత్సరం  భద్రాచలంలోని శ్రీ సీతారాముల కల్యాణానికి  సీతమ్మ కీ చీర  ను ఆనవాయితీగా  ఇస్తున్నాడు. గత సంవత్సరం సీతమ్మకు  చేనేత మగ్గంపై పట్టు పితాంబరం నేసి శ్రీరాములవారి కళ్యాణానికి అందజేశాడు.

ఈనెల 17న జరుగనున్న శ్రీ సీతారాముల కళ్యాణానికి   వెల్ది హరిప్రసాద్ మరో అద్భుతమైన చీరను  నేశాడు.చేనేత మగ్గంపై సీత రాముల కళ్యాణం వచ్చే విధంగా,  అంచులు భద్రాద్రి దేవాయాయంలో ఉన్నటువంటి సీతారాముల ప్రతిరూపాలు అంచులు వచ్చే విధంగా, చీర మొత్తం శంకు,చక్ర నామాలు తీరపై బార్డర్లో జైశ్రీరామ్ అంటూ వచ్చే విధంగా ఆరు రోజుల పాటు శ్రమించి ఈ చీరను చేనేత మగ్గంపై నేశాడు. చీరబరువు 800 గ్రాములు కాగా, ఇందులో రెండు గ్రాముల బంగారం, 150 గ్రాముల వెండి పట్టు దారాలతో నేశాడు. చీర కొంగులో సీతారాముల కళ్యాణం వచ్చే విధముగా నేయడం   విశేషం. చీరను  దేవాదాయ శాఖ మంత్రి సురేఖకు  చూపించి,సీతారాముల కల్యాణానికి అందిస్తాను హరి ప్రసాద్ తెలిపారు.