ఆధ్యాత్మికతతోనే మానసిక ప్రశాంతత - వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా  

ఆధ్యాత్మికతతోనే మానసిక ప్రశాంతత - వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా  

శాయంపేట, ముద్ర : నేటి ఆధునిక యుగంలో ప్రతి ఒక్కరూ మానసిక ఒత్తిళ్లకు గురవుతున్నారని, ఆధ్యాత్మికతతోనే మానసిక ప్రశాంతత చేకూరుతుందని వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు. మండలంలోని పెద్దకోడపాక గ్రామంలో శ్రీ రాజరాజేశ్వర ఆలయాన్ని కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని సోమవారం రాత్రి వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా కుటుంబ సమేతంగా ఆలయాన్ని సందర్శించారు. ఆలయ అర్చకులు అనుదీప్ శర్మ పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. శివలింగానికి పంచామృత అభిషేకాలు, అర్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో మహిళలు దీపాలతో డమరుకం ఆకృతి, ఆలయాన్ని దీపాల కాంతులతో ఏర్పాటు చేశారు. కాకతీయుల కాలంలో నిర్మించిన ఆలయ విశిష్టతను అర్చకులు అనుదీప్ శర్మ సిపికి వివరించారు. అనంతరం స్వామి వారి శేష వస్త్రాలతో సత్కరించి ఆశీర్వచనం చేశారు. పరకాల రూరల్ సీఐ మల్లేష్ సిపిని శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో సిఐ మల్లేష్, ఎస్సై దేవేందర్, సిబ్బంది, మహిళలు, భక్తులు పాల్గొన్నారు.