ఎల్ఆర్ఎస్ రెగ్యులరైజ్ ను...పాత జీవో ప్రకారం అమలు చేయాలి...
- కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పేది ఒకటి..చేసేది ఇంకొకటి
- గత ప్రభుత్వం 2020 ఆగస్టు లో తీసుకొచ్చిన జీవో ను ఇప్పుడు కాంగ్రెస్ సర్కారు అమలు చేస్తోంది
- 8వేల కోట్ల ఆదాయం వస్తోందని. ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ అంశాన్ని తెరపైకి తెస్తుంది
- కరీంనగర్ మాజీ పార్లమెంటు సభ్యులు బోయినపల్లి వినోద్ కుమార్.
ముద్ర ప్రతినిధి,రాజన్న సిరిసిల్ల: కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పేది ఒకటి,ఇప్పుడు చేసేది ఇంకొకటని.అధికారంలోకి రాక ముందు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి లు గత ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ జీవో తీసుకొస్తే రాద్దాంతం చేశారు.ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మళ్లీ ఎల్ఆర్ఎస్ అంశాన్ని తెరపైకి తెచ్చి వచ్చే నెల మార్చి 31 చివరి తేదీ గా ప్రకటన చేయడం ఏంటని కరీంనగర్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు.మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన విలెకర్ల సమావేశంలో మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం లో కేసీఆర్ 2020 ఆగస్టు 31న ఎల్ఆర్ఎస్ జీవో తీసుజురావడం జరిగిందని, ఆ జీవో ను ఇప్పుడు కాంగ్రెస్. ప్రభుత్వం అమలు చేయడానికి సిద్ధం అవుతుందని అన్నారు.
ఎల్ఆర్ఎస్ ద్వారా మున్సిపాలిటీలు, కార్పొరేషన్స్, గ్రామాల్లో లే అవుట్ లేని భూములను రెగ్యులరైజ్ చేసుకోవడానికి 25.44 లక్షల మంది దరఖాస్తులు చేసుకున్నారనీ, కొందరు కోర్టుకు వెళ్లి స్టే తీసుకురావడంతో , 25 శాతం మంది దరఖాస్తుదారులు రిస్క్ తీసుకుని రెగ్యులరైజ్ చేసుకున్నారని అన్నారు. ఆ సమయంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర పదజాలంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం పై విమర్శలు చేశారని. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఉచితంగా రెగ్యులరైజ్ చేస్తామని మాట్లాడి,ఇప్పుడు 8000ల కోట్ల ఆదాయం వస్తోందని..దానినే కంటిన్యూ చేస్తున్నారనీ అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పేది ఒకటి..చేసేది ఇంకొకటి అని అన్నారు. ఇచ్చిన మాట మీద కాంగ్రెస్ ప్రభుత్వం నిలబడటం లేదన్నారు.ఆనాడు సీఎంగా పదేళ్ళలో కేసీఆర్ గారు పేద ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఈ ఎల్ఆర్ఎస్ జీవో తెచ్చారని,.పాత జీవో ప్రకారమే భూములను రెగ్యులరైజ్ చేయాలని పేర్కొన్నారు.గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అప్పటి సీఎం కేసీఆర్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఎల్ఆర్ఎస్ జీఓ ను వచ్చే నెల చివరి వరకు పొడగిస్తున్నారని,రెగ్యులరైజ్ పేరుతో పేద ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేయొద్దు అని,మీరు ఇచ్చిన హామీని అమలు చేయాలి,లేకుంటే మాట్లాడింది తప్పని ఒప్పుకోవాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సి దేశపతి శ్రీనివాస్, మాజీ టెక్స్ టైల్ కార్పొరేషన్ ఛైర్మన్ గూడూరి ప్రవీణ్, బీఆర్ఏస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీనివాస్, కౌన్సిలర్ రాజిరెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు నర్సింగ రావు, రామ్మోహన్, రవి, జక్కుల నాగరాజు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.