చెరువును మాయం చేశారు

చెరువును మాయం చేశారు

 - రంగ చెరువు కోసం పోరాడుతాం
- సిరిసిల్ల నియోజకవర్గం ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి             
 ముద్ర,ఎల్లారెడ్డిపేట :

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని అల్మాస్ పూర్ గ్రామానికి చెందిన రంగం  చెరువును మాయం చేసి కుంటగా మార్చారని అల్మాస్పూర్ గ్రామస్తుల కొరకు పోరాటం చేస్తామని, ఆక్రమణను అడ్డుకుంటామని సిరిసిల్ల నియోజకవర్గం ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి మంగళవారం పేర్కొన్నారు. ఈ సందర్భంగా రంగం చెరువును  పూర్తిగా పరిశీలించి ఆక్రమణకు గురైన విధానాన్ని గ్రామస్తుల ద్వారా తెలుసుకున్నారు. తాహసిల్దార్ జయంతి కుమార్ తో ఫోన్లో  మాట్లాడి గ్రామస్తులతో కలిసి జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేస్తానన్నారు. కొంతమంది బిఆర్ఎస్  పార్టీ నాయకులు సామాజిక సేవ ముసుగులో కొందరు ప్రజాప్రతినిధులు కలిసి రంగం  చెరువును మొత్తము ఆక్రమించడానికి కోసం భూమిని చదును చేయడం జరిగిందన్నారు.

మంత్రి కేటీఆర్ చెరువుల పండుగలు చేస్తామని చెబుతా ఉంటే అల్మాస్పూర్ చెరువును బిఆర్ఎస్  పార్టీ నాయకులు ఆక్రమించుకోవడం అన్యాయమన్నారు. అల్మాసుపూర్, అక్కపల్లి, దుమాల  గ్రామాలకు సాగునీటికి ఆధారమైన ఈ చెరువు ద్వారా 650ఎకరాల పొలాలకు సాగునీరు అందడం జరుగుతుందన్నారు. ఫారెస్ట్ మధ్యలో ఉన్న ఈ చెరువు ఎప్పటికీ నీటితో కలకలలాడుతూ ఉండటం మూలంగా జంతువులకు పక్షులకు జీవనాధారం అన్నారు. రంగం  చెరువును కాపాడడానికి కాంగ్రెస్ పార్టీ గ్రామస్తుల పక్షాన నిలబడి ఎంతకైనా తెగించి కొట్లాడుతామని అన్నారు. చెరువును పరిశీలించిన వారిలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు షేక్ గౌస్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, నాయకులు చెన్ని బాబు, బీపేట రాజు, శెట్టిపల్లి బాలయ్య ,రామ్ రెడ్డి, పెద్దూరు సత్తయ్య, సోనవేని రాజయ్య  శ్రీనివాసరెడ్డి, చంద్రయ్య, గ్రామస్తులు పాల్గొన్నారు