ఉర్సు ఉత్సవంలో, దుర్గామాత సేవలో పాల్గొన్న కడియం

ఉర్సు ఉత్సవంలో, దుర్గామాత సేవలో పాల్గొన్న కడియం

ముద్ర, స్టేషన్ ఘన్ పూర్: జనగామ స్టేషన్ ఘన్ పూర్ మండలం కొత్తపెళ్లిలో జరిగిన ఉర్సు ఉత్సవంలో, చిల్పూర్ మండలం శ్రీపతి పల్లి లో ఆదివారం జరిగిన దుర్గామాత ఉత్సవాల్లో స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. షౌకత్ బేగ్ ఆధ్వర్యంలో కొత్తపల్లిలో జరిగిన ఉర్సు ఉత్సవంలో ఎంపీటీసీ బెల్లపు వెంకటస్వామి, సర్పంచ్ గోవిందు ఆనందం, ఉప సర్పంచ్ మహేందర్ గ్రామ శాఖ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు. శ్రీపతి పల్లి లో జరిగిన దుర్గామాత ఉత్సవంలో స్థానిక ఎమ్మెల్యే శ్రీహరి తో పాటు ఎంపీపీ సరిత బాలరాజు, సర్పంచ్ ప్రత్యూష మనోజ్ రెడ్డి, ఎంపీటీసీ ఎల్లమ్మ, మాజీ సర్పంచ్ రామదాసు, రంగు రమేష్, పల్లపు శీను, డాక్టర్ గుర్రపు వెంకటేశ్వర్లు, ఉడుత వెంకటనారాయణ తదితరులు పాల్గొన్నారు.