బీఆర్ఎస్ ను నమ్మి మోసపోకండి

బీఆర్ఎస్ ను నమ్మి మోసపోకండి
  • మీ బిడ్డగా నన్ను ఆశీర్వదించండి.. అభివృద్ధి చేస్తా..
  • స్టేషన్‌ఘన్‌పూర్‌‌ కాంగ్రెస్‌ అభ్యర్థి సింగపురం ఇందిర 

లింగాలణపురం, ముద్ర: ‘బీఆర్‌‌ఎస్‌ లీడర్ల కల్లబొల్లి మాటలు నమ్మి మోసపోకండి.. మీ బిడ్డగా నన్ను ఆశీర్వదించండి.. అభివృద్ధి కృషి చేస్తా..’ అని స్టేషన్‌ఘన్‌పూర్‌‌ కాంగ్రెస్ అభ్యర్థి సింగపురం సిందిర అన్నారు. జిల్లాలోని లింగాలఘణపురం మండలంలో పలు గ్రామాల్లో శనివారం ఆమె ప్రచారం నిర్వహించారు. అనంతరం మండల కేంద్రంలో జరిగిన మీటింగ్‌లో ఆమె మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే బడుగు బలహీన వర్గాల పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందన్నారు. బీఆర్ఎస్ పాలనలో స్టేషన్‌ఘన్‌పూర్‌‌ నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోలేదన్నారు. ఇప్పడు మరోసారి మోసం చేసుందుకు వారు వస్తున్నారని, వారికి తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.

రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలో చేసిన అభివృద్ధి తప్ప కేసీఆర్‌‌ సర్కారు చేసింది ఏమీ లేదన్నారు. ఈసారి తనను ఆదరించి అవకాశం ఇవ్వాలని ఆమె ఓటర్లు కోరారు. తెలంగాణలో తమ పార్టీ అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలను అమలు చేస్తుందని స్పష్టం చేశారు. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు రూ. 2,500, రూ.500లకే గ్యాస్ సిలిండర్‌‌, మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం, రైతు భరోసా కింద ఏటా రైతులు, కౌలు రైతులకు రూ.15  వేలు, వ్యవసాయ రూ.12 వేలు, గృహ జ్యోతి పథకం కింద 200 యూనిట్లు ఉచిత విద్యుత్ సరఫరా, ఇందిరమ్మ ఇల్లు లేని వారికి ఇంటి స్థలం రూ.5 లక్షలు, ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటి స్థలం, యువ వికాస్ పథకం కింద విద్యార్థులకు రూ.5 లక్షల విద్యా భరోసా కార్డు,  ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్,  చేయూత రూ.4 వేల పెన్షన్, రూ.10 లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా అందజేస్తామని వివరించారు. కార్యక్రమంలో లింగాలఘణపురం మండల కాంగ్రెస్ నాయకులు, యువజన నాయకులు, పలు గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.