ప్రజా,రైతు శ్రేయస్సే బిఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యం కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి

ప్రజా,రైతు శ్రేయస్సే బిఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యం కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి

ముద్ర,పానుగల్: ప్రజా,రైతు శ్రేయస్సే బిఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యం అని కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి అన్నారు.సోమవారం పానుగల్ మండల పరిధిలోని మాధవరావు పల్లి గ్రామ ఉపసర్పంచ్ రాఘవేందర్ నాయుడు,జిలానీతో పాటు 10 మంది ఇతర పార్టీల నాయకులు, మాందాపూర్ గ్రామ ఉప సర్పంచ్ బాలరాజు,సంజీవ,నరేష్ సాగర్,రాజారెడ్డి,సత్యశిలా రెడ్డి తో పాటు 100 మంది వివిధ పార్టీల నాయకులు,తెళ్లరాలపల్లి తండా గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రామారావు తో పాటు 50 మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు.పార్టీలో చేరిన వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు.అసెంబ్లీ ఎన్నికల్లో BRS పార్టీదే విజయం సాధిస్తుందన్నారు.గ్రామ గ్రామాన పార్టీ కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి సీఎం కెసిఆర్ ప్రవేశపెట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరించాలన్నారు. ఈ కార్యక్రమంలో BRS పార్టీ రాష్ట్ర నాయకులు రంగినేని అభిలాష్ రావు,గౌరారం వెంకట్ రెడ్డి , పానుగల్, వీపనగండ్ల ఎంపీపీ లు శ్రీధర్ రెడ్డి,కమలేశ్వర్ రావు, రైతు బంధు మండల కో ఆర్డినేటర్ వెంకటయ్య నాయుడు,ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ నాయక్,మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సోమనాథ్ నాయక్,BRS పార్టీ మండల అధ్యక్షుడు రాము యాదవ్,నాయకులు మధు కుమార్ రెడ్డి, నరసింహ నాయుడు,బాబు నాయక్,వివిధ గ్రామాల సర్పంచులు,ఎంపిటిసిలు, నాయకులు పాల్గొన్నారు