పిడుగుపాటుకు గొర్రెల మృతి

పిడుగుపాటుకు గొర్రెల మృతి

ముద్ర.వనపర్తి:- సోమవారం అర్ధరాత్రి ఉరుములు మెరుపులతో కూడిన అకాల వర్షం లోని పిడుగుపాటుకు అల్వాల గ్రామా టంకరి రమేష్ కు చెందిన 20 గొర్రెలు, బుడ్డన్నకు చెందిన 35 గొర్రెలు మృత్యువాతకు గురయ్యాయి.విషయం తెలుసుకున్న పెద్దమందడి మండల కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త తూడి శ్రీనివాస్ రెడ్డి, మండల నాయకులు సంఘటన స్థలానికి చేరుకుని పరామర్శించారు.గ్రామానికి చెందిన రమేష్ బుడ్డన్నలు వారి గొర్రెల మందను ఓకే చోట ఆపారు.ఈ క్రమంలో రాత్రి పడ్డ పిడుగుపాటుకు దాదాపు ఆరున్నర లక్షల విలువ గల 65 గొర్రెలు మృతి చందాయని వారు బాధితుల ద్వారా తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా మండల సమన్వయకర్త తూడి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ  గొర్రెలు చనిపోయిన కుటుంబాలకు తాము అండగా ఉంటామని ప్రభుత్వం తరఫున రావలసిన సహాయ సహకారాలు  అందజేసేందుకు కృషి చేస్తామని ఆయన బాధితులకు భరోసా కల్పించారు.కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి వెంకటస్వామి, జగత్ పల్లి గట్టు యాదవ్, మంగంపల్లి వెంకట్రామ్ రెడ్డి, అల్వాల, చంద్రశేఖర్ రెడ్డి, బాల్ రెడ్డి, కే వెంకటేశ్వర్ రెడ్డి చిన్నమందడి ఉప సర్పంచ్ డి శ్రీనివాసులు, రాఘవేంద్ర శెట్టి, మంగంపల్లి, హనుమంతు నాయక్, సుదర్శన్, జి వెంకటరామిరెడ్డి, గోవర్ధన్ రెడ్డి, ఎం చంద్రశేఖర్ రెడ్డి, కే వెంకటరెడ్డి, మైబూస్, రామకృష్ణారెడ్డి, గ్రామ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.