వివాదాస్పద భూములపై విచారణ– అర్హులైన రైతులకు న్యాయం

వివాదాస్పద భూములపై విచారణ– అర్హులైన రైతులకు న్యాయం

ముద్ర/వీపనగండ్ల:- మండల పరిధిలోని రంగవరం గ్రామ సమీపంలో వివాదాస్పదంగా ఉన్న ప్రభుత్వ భూమి పై విచారణ జరిపి అర్హులైన రైతులకు న్యాయం చేసేందుకు చర్యలు చేపట్టినట్లు తాసిల్దార్ వరలక్ష్మి తెలిపారు. రంగవరం సమీపంలోని ప్రభుత్వ భూమి సర్వే నెంబర్ 357 లో 351 ఒక ఎకరాలను గోపాల్ దీన్నే, రంగవరం, పుల్గర్ చర్ల గ్రామాల చెందిన 173 మంది రైతులకు ప్రభుత్వం పట్టాలను అందించింది. అయితే ఇందులో కొందరు రైతులు పట్టాలో పొందిన భూమి కంటే ఎక్కువ భూమిని సాగు చేస్తుండటంతో రైతుల మధ్య వివాదాస్పదం నెలకొంది. ఈ విషయంపై రంగవరం గోపాల్దిన్నె గ్రామానికి చెందిన కొందరు రైతులు తమకు పట్టాలో చూపించిన విధంగా భూమికి హద్దులు చూపించాలని తాసిల్దార్ కార్యాలయం ఎదుట పలుమార్లు ఆందోళనలు నిరాహార దీక్షలు చేపట్టారు.

ఈ విషయంపై మార్లు అధికారులు ప్రభుత్వ భూమి పైకి వెళ్లి విచారణ చేపట్టిన సమస్య పరిష్కారం కాకపోవటంతో రెండు నెలల క్రితం జిల్లా కలెక్టర్ తేజస్ నందాలాల్ పవర్, వనపర్తి ఆర్డిఓ పద్మావతి స్వయంగా ప్రభుత్వ భూమిని పరిశీలించి ఏ రైతు ఇంత భూమిని సాగు చేసుకుంటున్నారో తెలుసుకున్నారు. పట్టాలు పొందిన రైతులకు న్యాయం జరిగేలా చూస్తానని తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు రెండు రోజులుగా స్థానిక తాసిల్దార్ కార్యాలయం వద్ద తాసిల్దార్ వరలక్ష్మి, ప్రత్యేక భూసేకరణ అధికారి నాగరాజు పర్యవేక్షణలో వీపనగండ్ల డిప్యూటీ తాసిల్దార్ కృష్ణమూర్తి, పెబ్బేర్ డిప్యూటీ తాసిల్దార్ లక్ష్మీకాంత్, వనపర్తి డిప్యూటీ తాసిల్దార్ విజయసింహ, కొత్తకోట డిప్యూటీ తాసిల్దార్ శివకుమార్ లతో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి భూపట్టాలను పొందిన రైతుల నుంచి వాగ్మూలం తీసుకుంటున్నట్లు తాసిల్దార్ వరలక్ష్మి తెలిపారు. సర్వే నెంబర్ 357  లోని ప్రభుత్వ భూమిలో పట్టాలు పొందిన కొందరు రైతులు పట్టాలో చూపించిన దాని కంటే మోకపై ఎక్కువగా సాగు చేసుకుంటున్నారని, అలా కాకుండా పట్టాదారుకు ఎంత భూమి ఉందో గుర్తించి ఏలాంటి వివాదాస్పదం లేకుండా, రైతుల కు న్యాయం జరిగేలా చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో వీపనగండ్ల ఆర్ఐ కురుమూర్తి, ఘనపూర్ ఆర్ఐ గణేష్, చిన్నంబావి ఆర్ఐ రాములు, జూనియర్ అసిస్టెంట్లు మధు, రాజశేఖర్ ఉన్నారు.