ఇసుక ట్రాక్టర్ ఢీకొని యువకుడికి తీవ్రగాయాలు

ఇసుక ట్రాక్టర్ ఢీకొని యువకుడికి తీవ్రగాయాలు

ముద్ర: పెబ్బేరు (జులై 13) దివచక్ర వాహనంపై వెళ్తున్న ఓ యువకుడిని అతివేగంగా వెళ్తున్న ఇసుక ట్రాక్టర్ ఢీకొట్టడంతో కాలు నుజ్జు నుజ్జయి విరిగిపోయిన ప్రమాదం వనపర్తి జిల్లా పెబ్బేరు బైపాస్ వద్ద జరిగింది. పెబ్బేరు ఎస్సై జగదీశ్వర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. గద్వాల పట్టణానికి చెందిన బొచ్చ చిన్నా హైదరాబాదు నుండి గద్వాల వైపు వెళ్తున్నాడు. పెబ్బేరు – కొత్త కోట బైపాస్ ఆనంద్ భవన్ వద్ద పెబ్బేరు నుండి రాంపూర్ గ్రామానికి వెళ్తున్న ఇసుక ట్రాక్టరు అతివేగంగా వచ్చి బొచ్చు చిన్నాను ఢీకొట్టగా అతడి కాలు పూర్తిగా తెగిపడింది.

స్థానికులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఘటనా స్థలికి వెళ్లి క్షతగ్రాత్రుడిని కర్నూలుకు తరలించారు. పరిస్థతి విషమంగానే ఉన్నట్లు తెలుస్తోంది. నేషనల్ హైవే అథారిటీ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అతివేగంగా ట్రాక్టరు నడిపిన ఓనర్ కమ్ డ్రైవరు చాకలి రాఘవేంద్రపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.