24 గంటలు కరెంటు కావాలా–3 గంటల కరెంటు కావాలా

24 గంటలు కరెంటు కావాలా–3 గంటల కరెంటు కావాలా
  • కొల్లాపూర్ ఎమ్మెల్యే, బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బీరం హర్షవర్ధన్ రెడ్డి

ముద్ర.వీపనగండ్ల:-24 గంటలు కరెంటు ఇచ్చే బిఆర్ఎస్ పార్టీ కావాలా–3 గంటలు మాత్రమే రైతులకు కరెంటు ఇస్తమంటుంన్నా కాంగ్రెస్ పార్టీ కావాలా ప్రజలు ఆలోచించుకోవాలని, సబ్బండ వర్ణాల అభివృద్దే లక్ష్యంగా సంక్షేమ పథకాలు అమలు చేసి,రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిన బిఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కొల్లాపూర్ ఎమ్మెల్యే బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బీరం హర్షవర్ధన్ రెడ్డి  అన్నారు. మండల పరిధిలోని తూముకుంట సంగినేనిపల్లి వీపనగండ్ల గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేశామని, మళ్లీ ఒకసారి అవకాశం ఇచ్చి ఎన్నికల్లో గెలిపించాలని ఎమ్మెల్యే బీరం కోరారు. సిఎం.కేసీఆర్ ప్రజల సంక్షేమం కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని ,ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని, ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత చేసిన అభివృద్ధి కళ్ల ముందే ఉందని,తూముకుంట-కొండూరు బిడ్జి నిర్మాణం చేపట్టడం జరిగిందని,గ్రామాని కొందరు తమ గుప్పిట్లో ఉంచుకోవడడానికి ఫ్యాక్షన్ గ్రామంగా మార్చారని,తను ఎమ్మెల్యే గా గెలుపొందిన తరువాత ప్రశాంతగా మార్చనని అన్నారు,మళ్ళీ ఎమ్మెల్యే గా గెలుపొందిన తరువాత ఎస్బిఐ ను ఎర్పాటు చూపిస్తాన్నాని, కొల్లాపూర్ ను మరింతగా అభివృద్ధి చేసుకుందాం అని అన్నారు. సంక్షేమ పథకాలు ఇలాగే అమలు కావాలంటే..బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని,బిఆర్ఎస్ ప్రభుత్వం వస్తే అన్నపూర్ణ పథకం ద్వారా తెల్ల రేషన్ కార్డు కలిగిన లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ, ఆసరా పెన్షన్లు దశలవారీగా రూ.5016 వరకు పెంపు, రైతుబంధు సాయం రూ.16,000వేలకు పెంపు, సౌభాగ్య లక్ష్మి పథకం ద్వారా అర్హులైన మహిళలకు నెలకు రూ .3000 భృతి,400 రూపాయలకే గ్యాస్ సిలెండర్ పథకం, ఆరోగ్యశ్రీ గరిష్ట పరిమితి రూ.15 లక్షలకు పెంపు,పేదలకు ఇళ్ల స్థలాలు.. మొదలైన ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తారని..అందుకే కారు గుర్తుకు ఓటు వేసి మరొమారు గెలిపించాలని ప్రజలను కోరారు.కార్యక్రమంలో ఎంపీపీ కమలేశ్వరరావు,జడ్పీటీసీ మాధురి, తూముకుంట రైతు సేవా సహకార సంఘం అధ్యక్షుడు రామన్ గౌడ్, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు ముంత మల్లయ్య యాదవ్, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు సత్యనారాయణ గౌడ్, వీపనగండ్ల,తూముకుంట ఎంపీటీసీలు భాస్కర్ రెడ్డి,రాముడు, మండల కో ఆప్షన్ సభ్యురాలు మౌలాన్ బి, మహిళా నాయకురాలు బొమ్మిరెడ్డి జయంతి, నాయకులు కరుణాకర్ రెడ్డి, కిరణ్ గౌడ్, కురుమయ్య, వేణు మాధవరెడ్డి, రజాక్,యదయా గౌడ్, నారాయణరెడ్డి,శివ యాదవ్