మందు కోసం ఎగబడ్డ మద్యం ప్రియులు

మందు కోసం ఎగబడ్డ మద్యం ప్రియులు

భూదాన్ పోచంపల్లి, ముద్ర:-పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ ఉన్నందున గత రెండు రోజులుగా మద్యం దుకాణాలు మూసివేశారు. సోమవారం సాయంత్రం 6 గంటలకు ఎన్నికలు ముగియడంతో భూదాన్ పోచంపల్లి పురపాలక కేంద్రంలోని మద్యం దుకాణాలు తెరవడంతో మద్యం ప్రియులు వైన్స్ వద్ద బారులు తీరి మధ్యాన్ని కొనుగోలు చేశారు. దీంతో రోడ్డుపైనే వాహనాలు నిలపడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.