కళ్లకు గంతలు కట్టుకొని ఎ యన్ యంల విన్నూత్న నిరసన.

కళ్లకు గంతలు కట్టుకొని ఎ యన్ యంల విన్నూత్న నిరసన.
  • ఏఎన్ఎం లను రెగ్యూలరైజ్ చేయాలి. 
  • సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం డిమాండ్


భువనగిరి సెప్టెంబర్ 01 (ముద్ర న్యూస్):- వైద్య ఆరోగ్య శాఖలో కాంట్రాక్ట్ పద్దతిలో పనిచేస్తున్న  ఎ యన్ యం లను రెగ్యూలరైజ్ చేయాలనీ  సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ (సిఐటియు)జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్( సిఐటియు) ఆధ్వర్యంలో ఎ యన్ యం లు కొనసాగిస్తున్న సమ్మె 17 వ రోజుకు చేరుకున్నది.కళ్ళకు గంతలు కట్టుకొని విన్నూత్న రీతిలో ఎ యన్ యం లు నిరసన తెలియజేయడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం మాట్లాడుతూ వైద్య శాఖలో రెండవ ఎ యన్ యం లు,ఈసిఎయన్ యంలు, అర్బన్ హెల్త్ సెంటర్స్ ఎ యన్ యం లు, హెచ్ ఆర్డీ ఎ యన్ యంలు,ఇతర అన్ని స్కింలలో గత 20 సంవత్సరాలకు పైగా పనిచేస్తున్న ఎ యన్ యంలు ఉన్నారని తక్షణమే అందరినీ పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు.20 సంవత్సరాలుగా పనిచేస్తున్న ఏఎన్ఎంల సర్వీసులను పరిగణలోకి తీసుకోకుండా ఎ యన్ యం లుగా కొనసాగడం కోసం పరీక్షలు రాయాలని  నోటిఫికేషన్ విడుదల చేయడం సరైనది కాదని తక్షణమే ప్రభుత్వం పరీక్ష విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.ఇప్పటికే  సిఐటియు అధ్వర్యంలో  డైరెక్టరేట్ ఆఫ్ హెల్త్ కార్యాలయం ,హైదరాబాద్ ముందు , వైద్య ,ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ఇంటి ముందు ధర్నా నిర్వహించడం జరిగిందని ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించక పోతే సమ్మె ను మరింత ఉదృతం చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా నాయకురాల్లు దనమ్మ, నాగలక్ష్మి,నాగమణి,చంద్ర,ఇందిరా,శోభ,కవిత,పద్మ తదితరులు పాల్గొన్నారు.