కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు ఎండగట్టాలి

కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు ఎండగట్టాలి
  • కరపత్రం విడుదల

ముద్ర ప్రతినిధి, మెదక్:కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలని దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 2న గ్రామాలలో, 5న మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలలో ప్రజలు సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ. మల్లేశం పిలుపునిచ్చారు. శుక్రవారం మెదక్ కేవలం కిషన్ భవన్ లో సిపిఎం పార్టీ కరపత్రం విడుదల  చేశారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి  మల్లేశం మాట్లాడుతూ దేశంలో నిత్యవసర సరుకులు ధరలు రోజు రోజుకు ఆకాశాన్ని అంటుతున్నాయని, సామాన్య పేద ప్రజలు ఏమి కొని తినలేని పరిస్థితిలో ప్రజలు అల్లాడుతున్నారన్నారు. 2014లో ఉన్న ధరలకు పరిశీలిస్తే నేడు 50 శాతం నుండి 200 శాతానికి పెరిగాయన్నారు. కూరగాయల ధరలు 37 వరకు, పప్పులు 45 శాతం, బియ్యం 60 రూపాయలకు కేజీ, గ్యాస్ ధర 1200కు చేరిందన్నారు. ప్రజలు కొనుగోలు చేయాలన్న వారికి ఉపాధి పని కల్పించాల్సిన ప్రభుత్వం విఫలమైందని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. ఉద్యోగాలు, ఉపాధి లేనివాళ్లు గ్రామాలలో ఉపాధి హామీ పని చేసుకుని బతికేటటువంటి గ్రామీణ పేద ప్రజలు ఉపాధి హామీ పనిలో ఎక్కువమంది జీవనం కొనసాగిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యదర్శివర్గ సభ్యులు కే. నరసింహ, బి.బసరాజ్, కే. నాగరాజు పాల్గొన్నారు.