పార్లమెంట్ ఎన్నికలవేళ తెరపైకి నేరేళ్ల భాదితుల అంశం..

పార్లమెంట్ ఎన్నికలవేళ తెరపైకి నేరేళ్ల భాదితుల అంశం..
  • పార్లమెంట్ ఎన్నికల బరిలో నేరెళ్ల బాధితులు...
  • స్వతంత్ర అభ్యర్థిగాకోల హరీష్..
  • పార్లమెంట్ లో గోడు వినిపించడమే  లక్ష్యంగా బరిలోకి..

ముద్ర ప్రతినిధి, రాజన్న సిరిసిల్ల : నేరెళ్ల ఘటన జరిగి ఏళ్లు గడుస్తున్న,నేరెళ్ల బాధితులకు ఇప్పటివరకు న్యాయం జరగడం లేదని, పార్లమెంట్లో గోడు వినిపించడమే లక్ష్యముగా నేరేళ్ల బాధితుల తరఫున పార్లమెంట్ ఎన్నికల్లో నేరేళ్ల బాధితుల తరఫున పోటీలో ఉండబోతున్నానని నేరెళ్ల బాధితు డు కోల హరీష్ తెలిపారు.  

ఈ సందర్భంగా కోల హరీష్ మాట్లాడుతూ నేరేళ్ల బాధితులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన పోలీసులకు ప్రమోషన్లు వస్తున్నాయి,  కానీ బాధితులకు న్యాయం జరగడం లేదని అన్నారు.పోలీసుల థర్డ్ డిగ్రీ వల్ల ఎందుకూ పనికి రాకుండా పోయామని,అప్పటి మంత్రి కేటీఆర్ బాధితులను అన్ని రకాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చి పట్టించుకోలేదు,  అన్ని పార్టీలు నాయకులు న్యాయం చేస్తానని హామీ ఇచ్చిన ఇప్పటివరకు న్యాయం జరగలేదని అన్నారు. థర్డ్ డిగ్రీ ప్రయోగించిన పోలీసులపై కే సులు పెట్టిన ఇప్పటివరకు ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు అని,  అధికారులపై చర్యలు తీసుకోలేదని అన్నారు. నేరెళ్ల సంఘటనను జనాల్లోకి తీసుకువెళ్లి, న్యాయం అడుగుతామని,  పార్లమెంట్లో బాధితుల తరఫున గోడు వినిపిస్తానని,  అందుకే పార్లమెంట్ బరిలో నిలబడుతున్నామని అన్నారు.