‘తోట’ కోటాలో పదవుల పంచాయతీ..

‘తోట’ కోటాలో పదవుల పంచాయతీ..
  • బీఆర్ఎస్ మండలాధ్యక్ష పదవులపై లొల్లి
  • సొంత మండలంలోనే బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడిపై పెరుగుతున్న వ్యతిరేఖత
  • నాయకుల మధ్య పెరుగుతున్న అంతరాలు.. సమన్వయ పరచని ‘తోట’
  • ఎల్లారెడ్డిపేట మండలంలో నాలుగు బీఆర్ఎస్ గ్రూపులు..
  • తోట నిర్ణయంతో.. రెండు గ్రూపుల దీశగా వీర్నపల్లి మండల బీఆర్ఎస్
  • సిరిసిల్ల నియోజకవర్గంలో రెండు మండలాల అధ్యక్ష స్థానాలే మార్పు
  • ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి లో బీఆర్ఎస్ మండలాధ్యక్ష పదవుల కోసం పైరవీలు
  • కార్యకర్తలు, నాయకుల వద్ద సహనం కొల్పోతున్న తోట ఆగయ్య, తీవ్ర అసంతృప్తిలో బీఆర్ఎస్ శ్రేణులు

ముద్ర ప్రతినిధి, రాజన్నసిరిసిల్ల:రాజన్నసిరిసిల్ల జిల్లా బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య సొంత ఇలాకాలో పార్టీ పదవుల పంచాయతీ ప్రారంభమైంది. సొంత మండలంలోనే రోజు రోజుకు సొంత పార్టీ లీడర్ల లోనే వ్యతిరేఖత పెరుగుతుంది. తోట ఆగయ్య తొందరపాటు చర్యలు, సహనం కోల్పోయి ఇష్టానుసారంగా మాటలు వదిలిపెట్టడంతో సొంత పార్టీ లీడర్లలోనే వ్యతిరేఖత వ్యక్తమవుతుంది. మంత్రి కేటీఆర్ మాటను కాదని, ఇతరులకు పార్టీ పదవులు.. ఇతర హమీలు ముందస్తుగా జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య ఇవ్వడంతో పార్టీలో ఈ ఇబ్బందులు ఎదురవుతున్నాయని బీఆర్ఎస్ పార్టీలో చర్చ కొనసాగుతుంది. సిరిసిల్ల నియోజకవర్గంలో ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులుగా కొనసాగుతున్నవారిని యాధావిధిగానే కొనసాగించాలని, కేవలం ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి మండల పార్టీ అధ్యక్షులను మార్చాలని మంత్రి కేటీఆర్ ఆదేశించారు. ఎల్లారెడ్డిపేట బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు వలుస హరికృష్ణ సెస్ డైరక్టర్గా గెలుపొందడం, వీర్నపల్లి మండలాధ్యక్షులు రాజిరెడ్డికి ఏఏంసీ చైర్మన్గా పదవి రావడంతో పార్టీ అధ్యక్ష పదవులు వేరే వారిక ఇవ్వడానికి నిర్ణయం చేసినట్లు తెలిసింది.

బీఆర్​ఎస్​ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య

ఈ తరుణంలో మంత్రి కేటీఆర్ ఎల్లారెడ్డిపేట మండలాధ్యక్షుడిగా ఏఏంసీ మాజీ చైర్మన్ నర్సింహారెడ్డిని, వీర్నపల్లి మండలాధ్యక్షుడిగా మాజీ ఏఏంసీ వైస్ చైర్మన్ రాజేశ్ను సూచన ప్రాయంగా ప్రస్తావించగా.. జిల్లా అధ్యక్షులు వేరే పేర్లు సూచించినట్లు సమాచారం. నర్సింహారెడ్డిని కాదని నమిలికొండ శ్రీనివాస్ను ఎల్లారెడ్డిపేట మండలాధ్యక్ష పదవి ఇవ్వడానికి తోట ఆగయ్య ప్రయత్నం చేసి సెస్ మాజీ డైరక్టర్ కుంబాల మల్లారెడ్డిని రాజన్నపేటకు పంపించి.. మాట్లాడించడంతో రాజకీయం వేడెక్కింది. మంత్రి కేటీఆర్ను కాదని జిల్లా అధ్యక్షులు ఎలా హమీ ఇస్తాడంటూ మరో వర్గం తోట ఆగయ్యను వ్యతిరేఖించి ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. దీంతో వెనక్కి తగ్గిన తోట ఆగయ్య నర్సింహారెడ్డికే ఒప్పుకున్నట్లు సమాచారం. దీంతో నమిలికొండ శ్రీనివాస్ తోట ఆగయ్య వద్దకు వెళ్లి మీరే నాకు అధ్యక్ష పదవి ఇస్తానని హామీ ఇచ్చి.. మాట తప్పితే ఎలా అని ప్రశ్నించి.. నియోకవర్గంలో ఒక్కరు కూడా దళిత సామాజిక వర్గానికి చెందిన వారు పార్టీ అధ్యక్షులు లేరని సూచించాడు.దీంతో అసహానానికి గురైన బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య ఎస్సీలెందిరా.. ఎస్టీలెందిరా.. నేను ఓసీకి పదవి ఇవ్వాలనుకుంటున్న ఇస్తా.. అవ్వన్ని నన్ను అడగొద్దు.. నేను చెప్పిందే ఫైనల్ అంటూ వెళ్లిపోవాలని ఆదేశించినట్లు బాధితుడు నమిలికొండ శ్రీనివాస్ మండల బీఆర్ఎస్ శ్రేణుల వద్ద వాపోయినట్లు తెలిసింది.తెలంగాణా ఉద్యమంలో 2001 నుంచి పని చేసిన వారికి ప్రముఖ్యత ఇవ్వకుండా.. పదవులు అనుభవించిన వారికే పదవులు ఇస్తూ పాతవారిని విస్మరిస్తున్నరని కొంత మంది నాయకులు రహస్య సమావేశం ఏర్పాటు చేసుకోని తమకు జరుగుతున్న ఆన్యాయాన్ని మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు.

నర్సింహారెడ్డి

వీర్నపల్లి మండలంలో సైతం బీఆర్ఎస్ నేతలంతా ఏఏంసీ మాజీ వైస్ చైర్మన్ రాజేశ్ కు ఇవ్వాలని సపోర్టు చేస్తుండగా జిల్లా అధ్యక్షులు తొట ఆగయ్య ప్రస్తుత ఉపసర్పంచ్ రవికి ఇవ్వాలని పట్టుపడుతున్నట్లు తెలిసింది. ఎల్లారెడ్డిపేటలో నమిలికొండ శ్రీనివాస్కు, దుమాలకు చెందిన నర్సింహారెడ్డికి బీఆర్స్ పార్టీ అధ్యక్ష పదవి విషయంలో హోరా హోరీ పైరవీలు కొనసాగుతున్నాయి. తమకు అనుకూల నాయకుల వద్దకు వెళ్లి ప్రయత్నాలు చేస్తున్నారు. వీర్నపల్లి బీఆర్ఎస్ నేతలు సైతం తోట ఆగయ్య నిర్ణయంతో రెండు గ్రూపులుగా వీడిపోతున్నారు. మా మండలంలో ఇప్పటికి తోట ఆగయ్యనే పెత్తానం చెలాయిస్తున్నట్లు.. మేజార్టీ నాయకుల అభిప్రాయం తీసుకోకుండానే ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటు మంత్రి కేటీఆర్ కు తప్పుడు సమాచారం ఇస్తున్నట్లు మండల నాయకుల చర్చించుకుంటున్నారు.

నమిలికొండ శ్రీనివాస్​

ఎల్లారెడ్డిపేట బీఆర్ఎస్ లో గ్రూపు రాజకీయాలు

బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య సొంత మండలమైన ఎల్లారెడ్డిపేటలో బీఆర్ఎస్ లో నాలుగు గ్రూపులు కొనసాగుతున్నాయి. తోట ఆగయ్య వ్యవహార శైలి, ఏకపక్ష నిర్ణయాలు.. ఇష్టానుసార మాటలతో తోట ఆగయ్యకు సొంత క్యాడర్ దూరమవుతున్నారు. కార్యకర్తల ఫోన్లకు కూడా సరిగా సమాధాన ఇవ్వకపోవడం, మండలాల్లో సమస్యలు తలెత్తితే వాటిని పరిష్కార దిశగా చర్యలు తీసుకోకపోవడంతో ముస్తాబాద్, ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి, సిరిసిల్ల  బీఆర్ఎస్ ఆఘాదం ఏర్పడింది. నాయకుల మధ్య గ్రూపు రాజకీయాలు తలెత్తి.. పార్టీకి నష్టం కలిగే పరిస్థితి వచ్చిందని పలువురు బీఆర్ఎస్ నేతలు పేర్కొంటున్నారు. ఎల్లారెడ్డిపేటలో నేవూరి వెంకట్ రెడ్డి,చీటీ లక్ష్మణ్ రావు, తోట ఆగయ్య, తాజాగా కొండ రమేశ్ లు ఎవరికి వారు గ్రూపులు మెయింటన్ చేస్తూ.. ఎవరి కార్యక్రమాలు వారు చేసుకుంటున్నరని మండలంలో చర్చ కొనసాగుతుంది. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య సొంత మండలంలోనే పార్టీ లో లుకలుకలు ఉంటే .. సొంత మండలంపైనే పట్టు లేనప్పుడు జిల్లా మొత్తం పార్టీని ఏం నడిపించగలుగుతాడని పలువురు సొంత పార్టీలోనే చర్చించుకుంటున్నారు. 

వీర్నపల్లి ఉప సర్పంచ్​ రవి

ఎల్లారెడ్డిపేట రాజకీయ పరిణామాలపై మంత్రి కేటీఆర్ దృష్టి

బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య తీరుపై పలువురు బీఆర్ఎస్ నాయకులు మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. మండలంలో జరుగుతున్న పార్టీ పరిస్థితులు, ఆగయ్య తీరుపై వాట్సప్ మేసేజ్లు మంత్రి కేటీఆర్కు పంపించినట్లు సమాచారం. మంత్రి కేటీఆర్ స్పందించి త్వరలోనే సమస్యలన్ని పరిష్కారం అవుతాయని, అప్పటి వరకు ఓపిక పట్టాలని సూచించినట్లు తెలిసింది. ఎల్లారెడ్డిపేట మండలంలో బీఆర్ఎస్ మండలధ్యక్ష పదవి నేపధ్యంలో నెలకొన్న పరిణామాలు, రాజకీయ గ్రూపుల నేఫధ్యంలో జడ్పీటీసీ చీటీ లక్ష్మన్రావు రంగంలోకి దిగినట్లు తెలిసింది. అసంతృప్తితో ఉన్న నాయకులను చీటీ లక్ష్మణ్ రావు బుజ్జగింపులు చేసినట్లు తెలిసింది. మంత్రి కేటీఆర్ కోసం అంత పని చేయాలని, చిన్న చిన్న సమస్యలకు బాధపడవద్దంటూ.. ప్రతి విషయాన్ని మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారం చేసుకుందామని ఎల్లారెడ్డిపేట జడ్పీటీసీ సభ్యుడు చీటీ లక్ష్మణ్ రావు పేర్కొన్నట్లు తెలిసింది. ఈ సమస్యలపై జిలా అధ్యక్షులు తోట ఆగయ్యతో కలిసి జడ్పీటీసీ చర్చించి.. బీఆర్ఎస్ మండలాధ్యక్ష పదవి ఉద్యమకారుడైన రాజన్నపేటకు చెందిన నమిలికొండ శ్రీనివాస్కు, ఎల్లారెడ్డిపేట మండల రైతు సమన్వయ సమితి అధ్యక్ష పదవి దుమాల నర్సింహారెడ్డికి కేటాయించి.. మండలంలో గ్రూపు రాజకీయాలకు తావులేకుండా.. చేయాలని నిర్ణయం చేసినట్లు తెలిసింది. ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెల్లి సమస్యను సున్నితంగా పరిష్కరించేలా చేసుకోకున్నట్లు సమాచారం. వీర్నపల్లి మండల అధ్యక్ష పదవి కూడా ఆ మండల మేజార్టీ నాయకుల ఆలోచన ప్రకారం జంట పదవులు కాకుండా.. రాజేశ్కు ఇప్పిస్తే బాగుంటుందని పార్టీ అధినాకయత్వం ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. వీర్నపల్లి రవికి ప్రస్తుతం ఉపసర్పంచ్ పదవి ఉన్నందున.. తర్వాత మంచి పదవి ఇవ్వాలని ముఖ్య నేతలు నిర్ణయం చేసినట్లు తెలిసింది.దీంతో ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి మండల బీఆర్ఎస్ పార్టీ తలనొప్పులను తొలగించుకునేందుకు రంగం సిద్దం చేస్తున్నారు.

రాజేష్