ఆర్థిక సహాయం అందజేసిన గోలి మోహన్..

ఆర్థిక సహాయం అందజేసిన గోలి మోహన్..

ముద్ర, రుద్రoగి: రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రoగి మండల కేంద్రంలో గత వారం రోజుల క్రితం గల్ఫ్ ఏజెంట్ చేతిలో మోసపోయి   ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న వాసాల నరేష్ కుటుంబాన్ని ఆద్య గోలి ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ గోలి మోహన్ పరామర్శించి ఆ కుటుంబానికి పది వేల రూపాయల ఆర్థిక సాయం అందించారు. ఈ సందర్భంగా డాక్టర్ గోలి మోహన్ మాట్లాడుతూ మృతుడి భార్య లత ఇద్దరి పిల్లలకు భవిష్యత్తులో ఏ అవసరం ఉన్న తాను అండగా ఉంటానని భరోసా కల్పించారు