తాండూరు ఆర్టీసీ డిపోలో నూతన బస్ సర్వీస్ ను ప్రారంభించిన తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి 

తాండూరు ఆర్టీసీ డిపోలో నూతన బస్ సర్వీస్ ను ప్రారంభించిన తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి 

ముద్ర ప్రతినిధి, వికారాబాద్ :వికారాబాద్ జిల్లా తాండూరు ఆర్టీసీ డిపోలో సోమవారం నూతన బస్ సర్వీస్ (తాండూరు - కొత్తూరు వయా యాలాల్, దేవనూర్) ను ఆర్టీసీ అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ప్రారంభించారు.

ఈ సంధర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... చుట్టూ పక్కల గ్రామాల ప్రజలు బస్సు సర్వీసును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తాండూర్ మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమల్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు రవి గౌడ్,తాండూరు  డిపో మేనేజర్ సమత, సీఐ నిర్మల తదితరులు పాల్గొన్నారు.