మంత్రి వీరాంజనేయ స్వామికి ఏపీయూడబ్ల్యూజే అభినందనలు

మంత్రి వీరాంజనేయ స్వామికి ఏపీయూడబ్ల్యూజే అభినందనలు

ముద్ర, ఏపీ: ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్( ఏపీయూడబ్ల్యూజే) రాష్ట్ర అధ్యక్షులు ఐ. వి సుబ్బారావు ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా యూనియన్ జిల్లా నాయకులతో కలిసి రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ, దివాంగులు, సచివాలయం, వాలంటరీ వ్యవస్థ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన డోల బాల వీరాంజనేయ స్వామిని, ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట  శ్రీనివాసరెడ్డిని సోమవారం మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం రాష్ట్రంలో జర్నలిస్టుల సమస్యలన పరిష్కారానికి తమ వంతు ప్రయత్నం చేయాలని, జర్నలిస్టు అండగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా ముఖ్య నేతలు పాల్గొన్నారు.