కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన ఆర్టీసీ ఉద్యోగులు.. ఆర్టీసి ఉద్యోగులకు స్వీట్స్ పంపిణీ చేసిన ఎమ్మేల్యే చల్లా

కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన ఆర్టీసీ ఉద్యోగులు..  ఆర్టీసి ఉద్యోగులకు స్వీట్స్ పంపిణీ చేసిన ఎమ్మేల్యే చల్లా

ముద్ర.పరకాల: ఆర్టీసీ సంస్థను ప్రభుత్వంలో విలీనం చేస్తూ క్యాబినెట్‌ సమావేశంలో నిర్ణయం తీసుకోవడంపై ఆర్టీసీ ఉద్యోగులతో కలసి స్థానిక ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి బుధవారం పరకాల బస్ స్టేషన్ వద్ద పెద్ద ఎత్తున సంబురాలు చేసుకున్నారు. డ్రైవర్లు, కండక్టర్లు, కార్మికులు, ఇతర సిబ్బంది సిఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.

ఎమ్మేల్యే  మాట్లాడుతూ..

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ క్యాబినెట్‌ సమావేశంలో నిర్ణయం తీసుకోవడంపై సంతోషం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని, దశాబ్దాల కాలంగా ఉన్న ఆర్టీసి కార్మికుల కళను నెరవేర్చారని కొనియాడారు. అన్ని వేళలా అండగా నిలుస్తున్న బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్నీ ఆశీర్వదించాలని ఆయన కోరారు. ఎవరూ ఊహించని విధంగా సీఎం కేసీఆర్‌ 43 వేల మంది ఆర్టీసీ కార్మికుల భష్యత్తుకు బాటలు వేసే సాహసోపేత నిర్ణయం తీసుకున్నారని అన్నారు. గతంలో ఆర్టీసీ కార్మకుకు చేసిన సమ్మెను ప్రతిపక్ష నాయకులు గగ్గోలు పెట్టారని మండిపడ్డారు. ఎవ్వరూ ఎన్ని కుట్రలు చేసిన సీఎం కెసిఆర్ ప్రజా సంక్షేమం దిశగా వెళ్తారాన్నరు. ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆర్టీసీకి సీఎం కేసీఆర్ పెద్దపీట వేశారన్నారు.
ఈ సందర్బంగా ఆయన ఆర్టీసీ ప్రయాణికులతో ముచ్చటించారు. గత ప్రభుత్వాల హయాంలో ఆర్టీసీని పట్టించుకోలేదన్నారు. ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని విధాల చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ ఉన్నత అధికారులను ఆయన ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, ఆర్టీసీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.